ETV Bharat / sports

IPL 2021: 'కోహ్లీపై నాకు పూర్తి నమ్మకముంది'

author img

By

Published : Sep 21, 2021, 9:23 AM IST

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్​ కోహ్లీపై ఆ జట్టు స్పిన్నర్ చాహల్​ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్​ నాయకత్వంలో తమ జట్టు ఐపీఎల్​ ట్రోఫీ సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందని తెలిపాడు. యూఏఈ వేదికగా ఐపీఎల్‌-14(Ipl Season 2021) తిరిగి ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.

IPL2021
ఐపీఎల్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌ కోహ్లీ తొలి టైటిల్‌ అందిస్తాడనే నమ్మకం తనకుందని ఆ జట్టు స్పిన్నర్‌ చాహల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా తప్పుకుంటానని వెల్లడించిన కోహ్లీ.. తాజాగా ఆర్‌సీబీ సారథిగా తనకిదే చివరి ఐపీఎల్‌ సీజన్‌(Ipl Season 2021) అని ప్రకటించాడు. ఇప్పటివరకూ ఆర్‌సీబీ ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేదు.

"ఐపీఎల్‌-14(Ipl Season 2021) తిరిగి ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి టైటిల్‌ గెలిచేందుకు మాకు మంచి అవకాశాలున్నాయి. కోహ్లీ ఈ సారి జట్టును ఛాంపియన్‌గా నిలుపుతాడనే నమ్మకంతో ఉన్నా."

- యుజ్వేంద్ర చాహల్​, ఆర్​సీబీ స్పిన్నర్​

ఐపీఎల్​లో సోమవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో(rcb vs kkr 2021) జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు చిత్తుగా ఓడిపోయింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. అనంతరం కోల్‌కతా ఒక్క వికెట్‌ నష్టపోయి 10 ఓవర్లలో సునాయాస విజయం సాధించింది.

దీంతో బెంగళూరు ఐపీఎల్‌ 14వ(IPL2021) సీజన్‌లోని రెండో దశను ఓటమితో ఆరంభించింది. మరి చాహల్‌ అన్నట్లు ఆ జట్టు విజేతగా నిలుస్తుందా లేదా చూడాలి.

ఇదీ చదవండి: ENG Vs PAK: కివీస్​ బాటలో ఇంగ్లాండ్​.. పాకిస్థాన్​ పర్యటన రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.