ETV Bharat / sports

యశస్వి జైస్వాల్ సంచలనం.. 13 బంతుల్లో 50.. రాజస్థాన్​ ఘన విజయం

author img

By

Published : May 11, 2023, 9:59 PM IST

Updated : May 11, 2023, 11:02 PM IST

Yashasvi Jaiswals fastest half century in the ipl history
Yashasvi Jaiswals fastest half century in the ipl history

IPL 2023 RR vs KKR : ఇండియన్​ ప్రీమియర్​​ లీగ్​ 2023లో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​, కోల్​కతా నైట్​ రైడర్స్​ మధ్య మ్యాచ్​ జరిగింది. రాజస్థాన్​ ప్లేయర్​ యశస్వి జైస్వాల్​ సంచలన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్​ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. దీంతో కోల్​కతాపై రాజస్థాన్​ రాయల్స్​ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL 2023 RR vs KKR : ఇండియన్​ ప్రీమియర్​​ లీగ్​ 2023లో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​, కోల్​కతా నైట్​ రైడర్స్​ మధ్య మ్యాచ్​ జరిగింది. కోల్​కతా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్​ దంచికొట్టింది. కేవలం ఒక్క వికెట్​ నష్టానికి టార్గెట్​ ఛేదించింది. దీంతో కోల్​కతాపై రాజస్థాన్​ రాయల్స్​ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్​ ప్లేయర్​ యశస్వి జైస్వాల్​ (98*) సంచలన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్​చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 13 బంతుల్లో ఈ రికార్డును నెలకొల్పాడు. మరో ప్లేయర్​ సంజూ శాంసన్​ (48*) అద్భుత ప్రదర్శన చేశాడు. ఓపెనర్​ బట్లర్​ డకౌట్​ కాగా.. ఇద్దరే మ్యాచ్​ను ముగించడం విశేషం.

అంతకుముందు, టాస్​ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్​.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్​ రాయ్​ (10), గుర్భాజ్​ (18) ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆ తర్వాత దిగిన వెంకటేశ్​ అయ్యర్​ (57) హాఫ్​ సెంచరీతో అదరగొట్టాడు. స్కోర్​ బోర్డును కాస్త పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్​ రాణా (22) ఫర్వాలేదనిపించగా.. రస్సెల్​(10), రింకూ సింగ్​ (16) పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు సింగిల్​ డిజిట్​ స్కోరుకే వెనుదిరిగారు. ఇక, రాజస్థాన్​ బౌలర్లలో చాహల్​ 4 వికెట్లు తీసి చెలరేగిపోయాడు. బౌల్డ్​ రెండు వికెట్ల తీయగా.. సందీప్ శర్మ, అసిఫ్​ చెరో వికెట్​ పడగొట్టారు.

ఐపీఎల్​ చరిత్రలోనే ఫాస్టెస్ట్​ 50.. యశస్వి రికార్డ్
యువ సంచలనం యశస్వి జైస్వాల్​.. గురువారం కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో వీర విహారం చేశాడు. ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధ సెంచరీ బాది.. సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 13 బంతుల్లో ఈ నయా రికార్డును సృష్టించాడు. ఓపెనర్​గా దిగిన యశస్వి జైస్వాల్​.. మొత్తం 98* పరుగులు చేశాడు. 5 సిక్స్​లు, 13 ఫోర్లతో మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు.

Last Updated :May 11, 2023, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.