ETV Bharat / sports

JIO సినిమా యాప్​లో IPL మ్యాచ్​లకు ఫుల్​ వ్యూస్​.. ఈ ఐదు కారణాల వల్లే!

author img

By

Published : Apr 14, 2023, 10:21 PM IST

ఐపీఎల్‌ను జియో సినిమాలోనే ఇంతలా ప్రేక్షకులు ఎందుకు వీక్షిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ ఐదు అంశాల గురించి తెలుసుకోండి మరి.

ipl jio cinema
ipl 2023 in jio cinema

ప్రతిష్ఠాత్మక క్రీకెట్ లీగ్​.. ఐపీఎళ్​​ 16వ సీజన్ మళ్లీ వచ్చేసింది​. ఇప్పుడు దేశం మొత్తం ఐపీఎల్‌ను ఓ వేడుకలా జరుపుకుంటోంది. దాదాపు మూడు సీజన్ల గ్యాప్‌ తీసుకున్నాక మళ్లీ ఇప్పుడుతన పాత ఫార్మాట్‌లో అలరిస్తోంది. అయితే, 2023 ఐపీఎల్‌లో హైలైట్​గా నిలిచింది మాత్రం జియో సినిమా అనే చెప్పాలి. దీని ద్వారా ఐపీఎల్​ ప్రసారాలను ప్రజలు ఈజీగా చూస్తున్నారు. సరికొత్త ఫీచర్లు, అదిరిపోయే నాణ్యతతో జియో సినిమాలో ఇప్పుడు ఐపీఎల్‌ను వీక్షించొచ్చు.

ఈ కొత్త సీజన్‌ కవరేజీలో భాగంగా మొదటి వారం జియో సినిమా అదిరిపోయే రికార్డులను నమోదు చేసింది. తొలి వారాంతంలో ఈ టోర్నీ స్ట్రీమింగ్‌కు రికార్డు స్థాయిలో 147 కోట్లకు పైగా వీడియో వ్యూస్​ను సాధించింది. ఐపీఎల్‌ ఓటీటీ వ్యూస్‌లో మొత్తంలో.. ఈ వ్యూస్​ అత్యధికం అని చెప్పాలి. అంతే కాకుండా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 వ్యూస్‌ కంటే ఈ ఐపీఎల్ వీక్షణలే ఎక్కువట. ఐపీఎల్‌ను జియో సినిమాలో ఇంతలా ప్రేక్షకులు ఎందుకు వీక్షిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ ఐదు అంశాలను గురించి తెలుసుకోవాల్సిందే.

4K క్వాలిటీ:
జియో సినిమాలో ఐపీఎల్‌ను 4కే క్వాలిటీతో చూడొచ్చు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇలాంటి నాణ్యత ఉన్న స్ట్రీమింగ్‌ ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా దీని కోసం వినియోగదారుల డివైజ్‌/ సిస్టమ్స్‌ 4కేకి సపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే జియో సినిమా యాప్‌ కూడా ఉండాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సరికొత్త 'హైప్‌':
జియో సినిమా యాప్‌లో 'హైప్‌' అనే ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది సంస్థ. ఇటీవల జరిగిన SA20, TATA WPLలో ఈ ఫీచర్‌ను పరిశీలించారు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఈ ఫీచర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని వల్ల 'హైప్‌' ఫీచర్‌తో మ్యాచ్‌ను చూస్తుండగానే స్కోరింగ్‌ రేట్స్‌, బ్యాటర్ల స్కోరింగ్‌ ఏరియాలు, బౌలర్ల హీట్‌ మ్యాప్స్‌, వాగన్‌ వీల్స్‌తోపాటు ఇతర గణాంకాలను వీక్షకులు ఈజీగా చూసుకోవచ్చు. దీంతోపాటు లీన్‌ బ్యాక్‌, లీన్‌ ఫార్వర్డ్‌ ఆప్షన్లు.. వినియోగదారుడికి మంచి వీక్షణ అనుభూతిని ఇచ్చేలా ఉంటాయి.

ipl jio cinema
జియా సినిమా యాప్​

మల్టీ కెమెరా యాంగిల్​:
మనం సాధారణంగా మ్యాచ్‌ను టెలీకాస్టర్‌ చూపించిన యాంగిల్స్‌లోనే చూస్తుంటాం. అయితే జియో సినిమాలో మాత్రం మల్టీ కెమెరా అనే ఫీచర్‌ ఉంది. దీని ద్వారా లైవ్‌లో మ్యాచ్‌ను వివిధ కెమెరా యాంగిల్స్‌లో వీక్షించొచ్చు. మెయిన్‌ కెమెరా, కేబుల్‌ కెమెరా, బర్డ్స్‌ ఐ కెమెరా, స్టంప్‌ కెమెరా, బ్యాటర్‌ కెమెరా.. ఇలా అన్ని రకాల కెమెరాల నుంచి ఈ మ్యాచ్​ను వీక్షించవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇంగ్లిష్​ సహా 12 భారతీయ భాషల్లో :
జియో సినిమాలో ఐపీఎల్‌ను 12 భాషల్లో చూసే అవకాశం ఉంది. ఇంగ్లిష్‌, హిందీ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, బెంగాళీ, భోజ్‌పురి, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషల్లో కామెంటరీని కూడా వింటూ మ్యాచ్‌ను చూడొచ్చు. అంతే కాకుండా ఇన్‌సైడర్స్‌ ఫీడ్‌, హ్యాంగవుట్‌ ఫీడ్‌, ఫాంటసీ ఫీడ్‌, ఫ్యాన్‌జోన్‌ ఫీడ్‌ లాంటి 16 ఫీడ్స్‌లో ఈ మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ఇక జియో సినిమాలో ఐపీఎల్‌ ఛాంపియన్స్‌, లెజెండ్స్‌తో ఓ ఎలైట్‌ క్లబ్‌ కూడా ఉంది. అందులో ఏబీ డివిలియర్స్‌, సురేశ్‌ రైనా, క్రిస్‌ గేల్‌, రాబిన్‌ ఉతప్ప, అనిల్‌ కుంబ్లే, ఆర్పీ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, ఇయాన్‌ మోర్గాన్‌, గ్రేమ్‌ స్మిత్‌, స్కాట్‌ స్టైరిస్‌ లాంటి మాజీ స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఉచితం:
ఇన్ని అదిరిపోయే ఫీచర్లను కలిగిన జియో సినిమా యాప్​లో మనం ఫ్రీగా మ్యాచ్​లను వీక్షించవచ్చు. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఇలా అన్ని నెట్‌వర్క్‌ల్లోనూ జియో సినిమా సర్వీస్​లను ఉచితంగా అందిస్తున్నారు.

ipl jio cinema
జియా సినిమా యాప్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.