ETV Bharat / sports

కోహ్లీ కోసం పోటెత్తిన దిల్లీ.. సెహ్వాగ్​ కొడుకులతో లోకల్​ బాయ్!

author img

By

Published : May 7, 2023, 5:34 PM IST

Updated : May 7, 2023, 5:59 PM IST

IPL 2023 RCB vs DC : లోకల్​ బాయ్​ విరాట్​ కోహ్లీని చూడడానికి.. దిల్లీ వాసులు పొటెత్తారు. శనివారం బెంగళూరు, దిల్లీ మధ్య జరిగిన మ్యాచ్​లో తమ అభిమాన ప్లేయర్​ను చూడటానికి భారీ సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. ఈ మ్యాచ్​లో వీరెంద్ర సెహ్వాగ్​ కుమారులు సందడి చేశారు. వారిద్దరు కోహ్లీతో దిగిన ఫొటోలు నెట్టించ్లో చక్కర్లు కొడుతున్నాయి.

ipl 2023 rcb vs dc
ipl 2023 rcb vs dc

IPL 2023 RCB vs DC : శనివారం బెంగళూరు, దిల్లీ మధ్య మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్​లో విరాట్​ కోహ్లీని చూడడానికి పెద్ద ఎత్తున దిల్లీ వాసులు వచ్చారు. ఒక రకంగా కోహ్లీ లోకల్ బాయ్ కావడం వల్ల అతడిని చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
Kohli Delhi Address : గతంలో విరాట్ ​కోహ్లీ దిల్లీలో నివసించేవాడు. దిల్లీలోని పశ్చిమ్ విహార్‌లో ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. ఆ తర్వాత గురుగ్రామ్​లోని డీఎల్ఎఫ్ ఫేజ్​-1లో సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లి చేసుకున్న తర్వాత.. సంసారాన్ని ముంబయికి షిఫ్ట్ చేశాడు విరాట్​. ప్రస్తుతం ముంబయి అలీబాగ్ ప్రాంతంలోని ఓ భవనంలో నివాసం ఉంటున్నాడు.

ఈ మ్యాచ్​ను వీక్షించడానికి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, కోహ్లీ కుటుంబ సభ్యులు సైతం స్టేడియానికి వచ్చారు. టీమ్ఇండియా మాజీ స్టార్​ బ్యాటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ కూడా మ్యాచ్​ను వీక్షించాడు. తనతో పాటు తన ఇద్దరు కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్​ను స్టేడియానికి తీసుకువచ్చాడు​. వీఐపీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను తిలకించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం వారిద్దరూ విరాట్ కోహ్లీని కలిశారు. అతనితో సరదాగా ఫొటో దిగారు. ఈ ఫొటోను ఆర్యవీర్​ తన ఇన్​స్టాలో పోస్టు చేశాడు. గోట్​ సింబల్​ పక్కన లవ్​ సింబల్​ పెట్టి.. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి.

kohli with sehwag sons
కోహ్లీతో వీరేంద్ర సెహ్వాగ్​ కుమారులు

కోహ్లీ రికార్డుల పరంపర...
virat kohli ipl runs : సొంత గడ్డపై విరాట్​ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగించాడు. శనివారం జరిగిన మ్యాచ్​లో తన జట్టు ఓడినా.. కోహ్లీ చరిత్ర సృష్టించి మరో ఘనత సాధించాడు. ఈ దేశవాలీ లీగ్​లో 7000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్​గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఐపీఎల్​ ఇప్పటి వరకు 5 సెంచరీలతో పాటు 50 అర్ధ శతకాలు పూర్తి చేశాడు. ఇందులో విశేషమేంటంటే.. కోహ్లీకి ఇది 50వ హాఫ్​ సెంచరీ, ఈ సీజన్​లో ఇది 50వ మ్యాచ్​.. ఈ మ్యాచ్​లో చేసిన అర్ధ సెంచరీతో 50వ హాఫ్​ సెంచరీని నమోదు చేశాడు.

చిన్ననాటి కోచ్​కు కోహ్లీ పాదాభివందనం..
కోహ్లీని చూడడానికి తన చిన్ననాటి కోచ్​ వచ్చారు. మైదానంలో తన కోచ్​ను కలుసుకున్న విరాట్​.. ఆయనకు పాదాలకు నమస్కరించాడు. అనంతరం హగ్​ చేసుకున్నాడు. మ్యాచ్​ తర్వాత కోహ్లీ మాట్లాడాడు. 'నా క్రికెట్‌ జర్నీ ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడే నా ఆటను చూసి సెలక్టర్లు నన్ను ఎంపిక చేశారు. ఈ మైదానం పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. ఇలాంటి అద్భుతమైన విషయాలతో దేవుడు నన్ను ఆశీర్వదించాడు' అంటూ తన జర్నీని గుర్తు చేసుకున్నాడు.

Last Updated : May 7, 2023, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.