ETV Bharat / sports

IPL 2023: వరుస మ్యాచులు ఓడినా.. వార్నర్​ సరికొత్త రికార్డు.. తొలి క్రికెటర్​గా

author img

By

Published : Apr 12, 2023, 10:51 AM IST

ఐపీఎల్ 16వ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో ఓటమిని అందుకుంది. కానీ ఈ టీమ్​ కెప్టెన్ వార్నర్​ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తొలి క్రికెటర్​గా ఘనత సాధించాడు.

IPL 2023 Delhi capitals Skipper David Warner goes past 600 fours in IPL
IPL 2023: వరుస మ్యాచులు ఓడినా.. తొలి క్రికెటర్​గా వార్నర్​ సరికొత్త రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో భాగంగా అరుణ్‌ జెట్లీ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది దిల్లీ క్యాపిటల్స్​. ఫలితంగా దిల్లీ క్యాపిటల్స్‌ ఈ సీజన్​లో వరుసగా నాలుగో ఓటమిని అందుకుంది. కాగా, 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్‌ ఆఖరి బంతికి గెలుపొంది ఈ సీజన్​లో తొలి విజయాన్ని అందుకుంది.

అయితే ఈ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఓ సూపర్​ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో 600 ఫోర్లు బాదిన ఫస్ట్ ఫారెన్ క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 6 ఫోర్లు బాదిన డేవిడ్‌ భాయ్‌.. ఈ అరుదైన ఫీట్​ను అందుకున్నాడు. మొత్తంగా(దేశీ, విదేశీ) ఈ ఫీట్‌ అందుకున్న క్రికెటర్ల జాబితాలో టీమ్​ఇండియా సీనియర్​ ఓపెనింగ్ బ్యాటర్​, పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ 728 ఫోర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్​ ఓటమిపై వార్నర్ మాట్లాడుతూ.. "ఈ సీజన్‌లో గత మూడు మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగా జరిగాయి. చివరి ఓవర్‌లోనే మ్యాచ్​ ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌లో మేము చివరివరకు పోరాడం. మేము ఓడిపోయినప్పటికీ... మా టీమ్​ ప్లేయర్స్​ అద్భుతంగా రాణించారు. ఇక ముంబయి టాపర్డర్‌లో అయితే రోహిత్‌ శర్మ కీలక ఇన్నింగ్స్‌ బాగా ఆడాడు. మా టీమ్​లో నోర్జే, ముస్తాఫిజర్‌ రెహ్మన్‌ వంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్స్​ ఉన్నారు. వారు తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేశారు. కానీ బ్యాడ్ లక్​ మ్యాచ్‌లో​ ఓడిపోవాల్సి వచ్చింది. అలాగే లాస్ట్​ బాల్​కు నేను తప్పుడు వైపు త్రో వేశాను. వికెట్ల హైట్ దృష్టిలో పెట్టుకుని పైకి విసిరాను. అది ముంబకు కలిసొచ్చింది. ఏదేమైనప్పటికీ వరుసగా వికెట్లను కోల్పోవడం మా విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఇక అక్షర్‌ విషయానికి వస్తే.. అతడు క్లాసిక్‌ ఆల్‌రౌండర్‌. అతడు స్ట్రైకింగ్ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్లేయర్​ టాప్‌-4లో బ్యాటింగ్‌కు దిగితే చాలా బాగుంటుంది. మా నెక్ట్స్​ మ్యాచ్‌లో గెలవాలని భావిస్తున్నాం" అని వార్నర్​ పేర్కొన్నాడు.

కాగా, ఈ మ్యాచ్​లో ఫస్ట్​ టాస్‌ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌.. 19.4 ఓవర్లలో 172 పరుగులకు చేసి ఆలౌట్ అయింది. దిల్లీ బ్యాటర్లలో కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(51), అక్షర్‌ పటేల్‌(25 బంతుల్లో 54 పరుగులు) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ముఖ్యంగా అక్షర్​ చెలరేగి ఆడాడు. సిక్సర్లు బాదుతూ దూకుడుగా ఆడాడు. ముంబయి బౌలర్లలో బెరెన్‌డార్ఫ్‌, చావ్లా మూడు వికెట్లు తీయగా.. మెరిడిత్‌ రెండు వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి: Suryakumar: గోల్డెన్ డక్​ కింగ్​ భయ్యా నువ్వు.. ఇక టీ20ల్లో మొదలు పెట్టావా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.