ETV Bharat / sports

హార్దిక్ రికార్డు.. హాఫ్​సెంచరీతో అదుర్స్​.. సన్​రైజర్స్​ లక్ష్యం ఎంతంటే?

author img

By

Published : Apr 11, 2022, 9:17 PM IST

srh vs gt
IPL 2022

IPL 2022: సన్​రైజర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో హాఫ్​ సెంచరీతో రాణించాడు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య. దీంతో హైదరాబాద్​కు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టైటాన్స్.

IPL 2022: సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​లో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ టైటాన్స్​.. నిర్ణీత 20 ఓవర్లలో 162/7 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (50*) అర్ధ శతకంతో చెలరేగాడు. అభినవ్ మనోహర్ (35) రాణించాడు.​ ఓపెనర్ మ్యాథ్యూ వేడ్ (19)ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్​ల్లో అదరగొట్టిన శుభ్​మన్ గిల్ (7) ఈసారి నిరాశపరిచాడు.

హైదరాబాద్​ బౌలర్లలో భువనేశ్వర్ 2, నటరాజన్ 2, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు.

హార్దిక్​ రికార్డు: ఐపీఎల్​లో అరుదైన రికార్డు సాధించాడు హార్దిక్ పాండ్య. ఈ లీగ్​ అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్​గా నిలిచాడు. ఈ మైలురాయి చేరుకునేందుకు పాండ్య 1046 బంతులను ఎదుర్కొన్నాడు. ఈ జాబితాలో రసెల్ (657 బంతులు) అగ్ర స్థానంలో ఉండగా, గేల్ (943 బంతులు) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.