ETV Bharat / sports

IPL 2022: టాస్ గెలిచిన ముంబయి.. పంజాబ్ బ్యాటింగ్

author img

By

Published : Apr 13, 2022, 7:03 PM IST

Updated : Apr 13, 2022, 7:45 PM IST

IPL 2022
mumbai indians vs punjab kings

IPL 2022: ఐపీఎల్​ 2022లో తొలి గెలుపు కోసం ఆరాటపడుతున్న ముంబయి ఇండియన్స్.. పంజాబ్​తో మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది.

IPL 2022: టీ20 మెగా టోర్నీలో ఇప్పటి వరకు బోణీ కొట్టని ముంబయి జట్టు.. పంజాబ్​తో మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ముంబయి ఇప్పటివరకు నాలుగు మ్యాచ్​లు ఆడగా.. అన్నింట్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్​ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో ఏడో స్థానంలో ఉంది. పొట్టి ఫార్మాట్లో ముంబయి, పంజాబ్‌ జట్లు హెడ్ టు హెడ్ తలపడిన మ్యాచుల్లో 15-13 విజయాలతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్​లో ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందో చూడాలి.!

తుది జట్ల వివరాలు..

ముంబయి : ఇషాన్‌ కిషన్ (వికెట్‌ కీపర్‌), రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవీస్, సూర్యకుమార్ యాదవ్‌, తిలక్ వర్మ, కీరన్‌ పొలార్డ్, మురుగన్ అశ్విన్‌, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్‌ ఉనద్కత్‌, టైమల్ మిల్స్‌, బాసిల్ తంపి.

పంజాబ్‌ : మయాంక్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, జానీ బెయిర్‌ స్టో, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, జితేశ్‌ శర్మ, షారుఖ్‌ ఖాన్‌, ఒడియన్‌ స్మిత్‌, కగిసో రబాడ, రాహుల్ చాహర్‌, అర్ష్‌దీప్ సింగ్‌, వైభవ్‌ అరోరా.

ఇదీ చూడండి: రోహిత్ తను 'హిట్​మ్యాన్' అని గుర్తుపెట్టుకోవాలి: సెహ్వాగ్​

Last Updated :Apr 13, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.