ETV Bharat / sports

IPL 2021 News: దిల్లీ-రాజస్థాన్​ మ్యాచ్​.. ఫేవరెట్ ఎవరు?

author img

By

Published : Sep 25, 2021, 5:31 AM IST

ipl
ఐపీఎల్

నేటి(సెప్టెంబర్ 25) ఐపీఎల్(IPL 2021 News)​​లో రాజస్థాన్ రాయల్స్​తో తలపడనుంది దిల్లీ క్యాపిటల్స్(rr vs dc 2021). పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం దిల్లీ, ప్లే ఆఫ్స్​ బెర్తు కోసం రాజస్థాన్​ ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఐపీఎల్ (IPL 2021 News)​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (సెప్టెంబర్ 25) పాయింట్ల పట్టికలో అగ్రస్థానమే లక్ష్యంగా ఆడుతున్న దిల్లీ క్యాపిటల్స్​తో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం శ్రమిస్తున్న రాజస్థాన్ రాయల్స్(rr vs dc 2021) తలపడనుంది. ఈ రెండు జట్లు గత మ్యాచ్​ల్లో విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. చివరగా జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​పై 8 వికెట్ల తేడాతో దిల్లీ విజయభేరి మోగించగా.. పంజాబ్ కింగ్స్(pk vs rr 2021)​పై ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో గెలుపు రుచి చూసింది రాజస్థాన్(rajasthan royals players 2021).

రాజస్థాన్(rajasthan royals players 2021) బ్యాటింగ్ విషయానికి యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, మహిపాల్ లోమ్రోర్​ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. కెప్టెన్ శాంసన్ మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. బౌలింగ్​లో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్​తో పాటు యువ బౌలర్ కార్తీక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. పంజాబ్(pk vs rr 2021)​తో జరిగిన మ్యాచ్​లో ప్రత్యర్థి విజయానికి చివరి రెండు ఓవర్లలో 8 పరుగులు కావాల్సి ఉండగా.. రెహమాన్ కేవలం నాలుగు పరుగులే ఇవ్వగా.. చివరి ఓవర్లో త్యాగి కేవలం ఒకే రన్ ఇచ్చి రెండు వికెట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు.

దిల్లీ విషయానికి వస్తే బ్యాటింగ్​లో ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా మంచి ఆరంభాన్ని అందిస్తున్నారు. ధావన్ ఇప్పటికే సీజన్​లో టాప్ స్కోర్(422)​గా కొనసాగుతున్నాడు. వీరిద్దరూ ఇప్పటికే సీజన్​లో 88 సిక్సులు, 21 ఫోర్లు బాదారు. ఇలాంటి విధ్వంసకర ఓపెనర్లను ఆపడానికి రాజస్థాన్ చాలా శ్రమించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరి తర్వాత యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ పంత్ మంచి ఫామ్​లో ఉన్నారు. మిడిలార్డర్​లో స్మిత్, హెట్​మెయర్ కూడా ఆకట్టుకునే వీలుంది. బౌలింగ్​ విభాగంలో పేసర్లు రబాడ, నోర్ట్జే, ఆవేశ్ ఖాన్​ ప్రత్యర్థిని దెబ్బతీయడంలో దిట్టగా తయారయ్యారు.

జట్లు (అంచనా)

దిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, ధావన్, శ్రేయస్ అయ్యర్, పంత్ (కెప్టెన్), స్టోయినిస్/స్మిత్, హెట్​మెయర్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, రబాడ, ఎన్రిచ్ నోర్ట్జే, ఆవేశ్ ఖాన్

రాజస్థాన్ రాయల్స్
ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్), లివింగ్​స్టోన్, మహిపాల్ లోమ్రోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రెహ్మన్.

ఇవీ చూడండి: నో బాల్​ వివాదం.. భారత్​పై ఆసీస్ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.