ETV Bharat / sports

రాజస్థాన్​కు షాక్​.. ఐపీఎల్​కు బట్లర్​ దూరం

author img

By

Published : Aug 21, 2021, 8:31 PM IST

రాజస్థాన్​ రాయల్స్​ ఓపెనర్​ జాస్​ బట్లర్ ఐపీఎల్​ రెండో దశ నుంచి​ తప్పుకున్నాడు. ఆ సమయంలో బట్లర్​ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పుడు ఆమెకు తోడుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడతడు.

buttler
బట్లర్​

రాజస్థాన్​ రాయల్స్​కు ఎదురుదెబ్బ తగిలింది. డాషింగ్​ ఓపెనర్​ జాస్​ బట్లర్​.. యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న ఐపీఎల్​ రెండో దశకు అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ట్వీట్​ చేసింది.

బట్లర్​ భార్య లూయిస్..​ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పుడు ఆమెకు తోడుగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు బట్లర్​.

ఐపీఎల్-2021​ తొలి దశలో ఏడు మ్యాచ్​లు ఆడిన రాజస్థాన్​ రాయల్స్ మూడు మ్యాచ్​లు గెలిచింది​. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. చివరి మ్యాచ్​లో బట్లర్​ 64 బంతుల్లో 124 పరుగులు చేశాడు.

యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 19 నుంచి ఈ మెగా లీగ్​ రెండో దశ ప్రారంభంకానుంది. పలు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకుని కసరత్తు షురూ చేశాయి.

ఇదీ చూడండి: IPL 2021 : ఆర్​సీబీలో భారీ మార్పులు.. జట్టుకు కొత్త కోచ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.