ETV Bharat / sports

లివింగ్​స్టోన్​ విధ్వంసం.. ఈ సీజన్​లోనే భారీ సిక్సర్​

author img

By

Published : May 4, 2022, 9:59 AM IST

Liam livingstone longest six: గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ ఆటగాడు లియామ్​ లివింగ్​స్టోన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. 117 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్‌లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

IPL 2022 Liam Livingstone longest six
లివింగ్​స్టోన్ భారీ సిక్స్​

Liam livingstone longest six: ఈ ఐపీఎల్​ భాగంగా గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ ఆటగాడు లియామ్​ లివింగ్​స్టోన్ ఓ రికార్డు సాధించాడు. ఈ సీజన్​లోనే భారీ సిక్సర్​ నమోదు చేశాడు. పంజాబ్​ ఇన్నింగ్స్​ 16వ ఓవర్​ ​వేసిన షమీ బౌలింగ్​లో మూడు సిక్స్​లు, రెండు ఫోర్లు బాది(వరుసగా 6,6,6,4,2,4) 28 పరుగులు సాధించాడు.

ఈ ఓవర్‌లోనే తొలి బంతికి 117 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్‌లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా లివింగ్‌స్టోన్ నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొత్తంగా 10 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు ముంబయి ఇండియన్స్‌ యువ ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌ 112 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇదీ చూడండి: IPL 2022: గుజరాత్‌ జోరుకు బ్రేక్​.. పంజాబ్‌ ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.