ETV Bharat / sports

ఆ దేశ క్రికెటర్ల రాకతో మరింత సందడిగా ఐపీఎల్​

author img

By

Published : Aug 3, 2021, 3:29 PM IST

ఐపీఎల్ 14 రెండో అర్ధభాగంలోనూ ఇంగ్లాండ్​ క్రికెటర్లు సందడి చేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.

IPL
ఐపీఎల్

ఐపీఎల్​-2021లో ఇంగ్లాండ్​ క్రికెటర్లు ఆడనున్నారని ధ్రువీకరించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). సెప్టెంబరు-అక్టోబరులో జరగాల్సిన ఇంగ్లాండ్​- బంగ్లాదేశ్​ సిరీస్​ వాయిదా పడిన నేపథ్యంలో వారు ఐపీఎల్​లో పాల్గొనేందుకు వీలు కలిగింది. అయితే ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డుతో బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఉన్న సత్సంబంధాల కారణంగా ఇది సాధ్యపడిందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

ఈ ఐపీఎల్​ను.. ఆ వెంటనే జరిగే టీ20 ప్రపంచకప్​ సన్నద్ధత కోసం ఇంగ్లాండ్ ఉపయోగించుకోనుంది. కాగా, యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్​ తిరిగి ప్రారంభం కానుంది.

బయోబబుల్​లో కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఐపీఎల్​-14 అర్ధంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత.. మళ్లీ సెప్టెంబర్​లో నిర్వహించాలని బోర్డు యోచిస్తున్నట్లు అప్పట్లోనే వార్తలొచ్చాయి. అయితే.. ఆ సమయంలో తమ క్రికెటర్లు ఆడటం కుదరదని ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు.. ఇంగ్లాండ్​ క్రికెటర్లు ఆడుతుండటం మంచి పరిణామంగా చెప్పొచ్చు.

ఇదీ చూడండి: IPL 2021: సెప్టెంబర్​ 19 నుంచి ఐపీఎల్​.. పూర్తి షెడ్యూల్​ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.