ETV Bharat / sports

ఇది కేవలం ఆట మాత్రమే: సాక్షి సింగ్

author img

By

Published : Oct 26, 2020, 9:48 AM IST

Updated : Oct 26, 2020, 12:10 PM IST

అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. కానీ, ఈ ఏడాది ప్లేఆఫ్స్​ నుంచి వైదొలిగిన తొలి జట్టుగానూ నిలిచింది. ఈ నేపథ్యంలో.. ధోనీ సతీమణి సాక్షి ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.

Sakshi_Dhoni_CSK
'వెనుదిరిగిన చెన్నై ... వాపోయిన సాక్షి'

ఈ ఏడాది ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్​కు ఏమాత్రం కలిసిరాలేదు. వరుస పరాజయాలతో చతికలపడి ప్లేఆఫ్స్​కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో అభిమానులతో పాటు సీఎస్కే సారథి ధోనీ సతీమణి సాక్షి కూడా నిరాశకు గురైంది. తాజాగా చెన్నై ఓటములపై స్పందించిన సాక్షి.. ఓ భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది.

"కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం.. ఇదొక ఆట మాత్రమే!
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన చోటే మరికొన్ని దారుణ వైఫల్యాలు చవిచూశాం.
అందులో ఎన్నో ఏళ్లు గడిచిపోయినా.. గెలిచినప్పుడు సంతోషించాం, ఓడినప్పుడు బాధపడ్డాం.
కొన్ని గెలుపొందాం, మరికొన్ని ఓడిపోయాం. ఇంకొన్ని వదులుకున్నాం.. ఇదొక ఆట మాత్రమే!
ఎన్నో విమర్శలు, మరెన్నో అవమానాలు..
కానీ, ఒక క్రీడాకారుడిగా ఈ భావోద్వేగాలు నీ స్ఫూర్తిని అధిగమించేలా చేయకు.
ఇదో ఆట మాత్రమే!
ఓడాలని ఎవరూ అనుకోరు, అలా అని అందరూ గెలవలేరు!
ఆటలో ఆగిపోయినప్పుడు మైదానాన్నీ వీడడం భారంగా ఉంటుంది. ఇదొక ఆట మాత్రమే!
మీరు అప్పుడూ విజేతలే, ఇప్పుడూ విజేతలే
నిజమైన యోధులు పోరాడటానికే పుడతారు. మా మదిలో, హృదయాల్లో ఎప్పటికీ నిలిచే సూపర్‌ కింగ్స్‌లా" అనే అర్థాన్నిచ్చే ఈ పద్యంతో సాక్షి.. సీఎస్కే అభిమానులకు మనోధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేసింది.

సాక్షి కామెంట్​ను సీఎస్కే జట్టు ట్విట్టర్​ ఖాతా కూడా షేర్​ చేసింది. కానీ, దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. గతంలో కూడా కోల్​కతా మ్యాచ్​లో ధోనీ, కేదార్​ జాదవ్​ ఆటతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఇదీ చదవండి:చెన్నై చితక్కొట్టుడు.. బెంగళూరుపై ఘనవిజయం

Last Updated : Oct 26, 2020, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.