ETV Bharat / sports

సీఎస్కే ప్లేఆఫ్స్​ అవకాశాలు గల్లంతేనా?

author img

By

Published : Oct 20, 2020, 11:54 AM IST

సోమవారం రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. దీంతో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కానీ లీగ్ చరిత్రను గమనిస్తే ధోనీసేన ప్లేఆఫ్స్​ వెళ్లేందుకు ఇంకా అవకాశం ఉంది.

IPL 2020: Will CSK make the playoffs this season?
సీఎస్కే ప్లేఆఫ్స్​ అవకాశాలు గల్లంతేనా?

ప్రస్తుత ఐపీఎల్ సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమవుతోంది. లీగ్​లో ప్రతి ఏడాది ప్లేఆఫ్స్​కు అర్హత సాధిస్తూ వస్తోన్న సీఎస్కే ఈ సీజన్​లో మాత్రం ఏడు మ్యాచ్​ల్లో ఓడి అవకాశాల్ని దూరం చేసుకుంది. దీంతో అభిమానులు ఇంకా తమ జట్టు ప్లేఆఫ్ అవకాశాలపై చిన్న ఆశతో ఉన్నారు.

ఇప్పటివరకు 10 మ్యాచ్​లు ఆడిన ధోనీసేన ఏడింటిలో ఓటమిపాలైంది. నెట్​ రన్​రేట్ -4.63గా ఉంది. ఈ గణాంకాలు చూస్తే మాత్రం సీఎస్కే ప్లేఆఫ్స్​కు వెళ్లడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే కెప్టెన్ ధోనీతో పాటు కోచ్ ఫ్లెమింగ్ మాత్రం ఇంకా పాజిటివ్​గానే ఆలోచిస్తున్నారు.

సాధ్యమేనా?

ఈ సీజన్​లో చెన్నై ఇంకా నాలుగు మ్యాచ్​లు ఆడాలి. ఈ మ్యాచ్​లన్నింటిలో గెలిచినా.. నెట్​ ​రన్​రేట్ చాలా మెరుగ్గా ఉండాల్సి ఉంది. దీంతో ప్రతి మ్యాచ్​లోనూ రన్​రేట్​పై దృష్టిసారించాలి. అలాగే ఇప్పటివరకు లీగ్​లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లను పరిశీలిస్తే ఎక్కువగా 14 పాయింట్లతో ప్లేఆఫ్స్​కు అర్హత సాధించినవే. కానీ గతేడాది సన్​రైజర్స్​ మాత్రం కేవలం ఆరు మ్యాచ్​లు గెలిచి ప్లేఆఫ్స్​కు వెళ్లింది. రన్​రేట్ అద్భుతంగా ఉండటం వల్ల కోల్​కతాను వెనక్కి నెట్టి హైదరాబాద్ ముందుకెళ్లింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.