ETV Bharat / sports

సచిన్​ ప్రశంసలకు పొంగిపోయిన శాంసన్​!

author img

By

Published : Sep 23, 2020, 4:46 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

సంజూ శాంసన్​ బ్యాటింగ్​ను సచిన్​ ప్రశంసించాడు. దీనిపై స్పందించిన అతడు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశాడు.

samson
శాంసన్​

చెన్నై సూపర్ కింగ్స్​తో మంగళవారం జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసిన రాజస్థాన్​ క్రికెటర్ సంజూ శాంసన్​ను మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందుల్కర్​​ ప్రశంసించాడు. క్లీన్​ స్టైకింగ్​ చేశాడంటూ ట్వీట్​ చేశాడు. ఈ క్రమంలోనే మాస్టర్​కు కృతజ్ఞతలు చెబుతూ రీట్వీట్ చేశాడు సంజు​.

ఈ మ్యాచ్​లో 16 పరుగుల తేడాతో సీఎస్కేపై విజయం సాధించింది రాజస్థాన్. తద్వారా ప్రస్తుత ఐపీఎల్​లో బోణీ కొట్టింది. 32 బంతుల్లో 74 పరుగులు చేసిన సంజూ.. గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్'​గానూ నిలిచాడు.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.