ETV Bharat / sports

ముంబయి ఇండియన్స్​ ఖాతాలో మరో విజయం

author img

By

Published : Oct 11, 2020, 7:29 PM IST

Updated : Oct 11, 2020, 11:16 PM IST

IPL 2020: DC vs MI Match Live Updates
టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ

23:10 October 11

5 వికెట్ల తేడాతో గెలుపు

ముంబయి ఆల్‌రౌండ్ షోతో మరోసారి అదరగొట్టింది. అబుదాబి వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 162 పరుగులు చేయగా.. ఛేదనలో మరో రెండు బంతులు మింగిలుండగానే రోహిత్​సేన లక్ష్యాన్ని ఛేదించింది. ముంబయి బ్యాట్స్​మన్​ డికాక్​ మెరుపు ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. 

22:52 October 11

ఇషాన్​ కిషన్​ ఔట్​

152 పరుగుల వద్ద ముంబయి బ్యాట్స్​మన్ ఇషాన్​ కిషన్​(28) ఔటయ్యాడు. ముంబయి ఇండియన్స్​ గెలుపు కోసం 15 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిఉంది. 

22:41 October 11

16 ఓవర్లకు ముంబయి 137/4

16 ఓవర్లకు 137 పరుగులు చేసింది ముంబయి. కిరన్​ పొలార్డ్​(2), ఇషాన్ కిషన్ (21) క్రీజులో ఉన్నారు. రోహిత్​సేన గెలుపు కోసం 24 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిఉంది. 

22:36 October 11

హార్దిక్ డకౌట్

నాలుగో వికెట్ కోల్పోయింది ముంబయి. హార్డిక్ పాండ్యా డకౌట్​గా వెనుదిరిగాడు.

22:33 October 11

సూర్య కుమార్ ఔట్

మూడో వికెట్ కోల్పోయింది ముంబయి. 53 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం ముంబయి 15 ఓవర్లకు 130 పరుగులు చేసింది.

22:12 October 11

11 ఓవర్లకు ముంబయి 81/2

11 ఓవర్లలో 81 పరుగులు చేసింది ముంబయి. సూర్య కుమార్ యాదవ్ (20), ఇషాన్ కిషన్ (0) క్రీజులో ఉన్నారు.

21:48 October 11

బ్యాటింగ్​లో దూకుడు పెంచిన ముంబయి

ఆరు ఓవర్లకు ముంబయి ఇండియన్స్​ వికెట్​ నష్టపోయి 44 పరుగులు చేసింది. డికాక్​(38), సూర్యకుమార్​ యాదవ్​(0)  క్రీజ్​లో ఉన్నారు. 

21:44 October 11

రోహిత్​ శర్మ ఔట్​

దిల్లీ బౌలర్ అక్షర్​ పటేల్​ వేసిన బంతిని భారీషాట్​గా మలచబోయిన ముంబయి బ్యాట్స్​మన్​ రోహిత్​శర్మ(5) రబాడాకు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

21:40 October 11

4 ఓవర్లకు ముంబయి 24/0

నాలుగు ఓవర్లు పూర్తయ్యే సమయానికి రోహిత్​సేన వికెట్​ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో డికాక్​(18), రోహిత్​ శర్మ(5) ఉన్నారు. 

21:33 October 11

2 ఓవర్లకు ముంబయి 7/0

163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి క్యాపిటల్స్​ జట్టు ఆచితూచి ఆడుతుంది. రెండు ఓవర్లు పూర్తయ్యే సమయానికి రోహిత్​సేన వికెట్​ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో డికాక్​(4), రోహిత్​ శర్మ(2) ఉన్నారు. 

21:06 October 11

ముంబయి లక్ష్యం 163

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ప్రారంభం నుంచి దూకుడుగానే ఆడింది దిల్లీ. ఓపెనర్ పృథ్వీ షా 4 పరుగులకే ఔటైనా.. మరో ఓపెనర్ ధావన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ లీగ్​లో మొదటి మ్యాచ్ ఆడిన రహానే 15 పరుగులు చేసి ఔటయ్యాడు. సారథి శ్రేయస్ అయ్యర్ 42 పరుగులతో ధావన్​తో కలిసి మిడిల్ ఓవర్లలో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. తర్వాత స్టోయినిస్ 13 పరుగులు చేసి విఫలమయ్యాడు. కానీ చివరి ఓవర్లలో ముంబయి బౌలర్లు దిల్లీ బ్యాట్స్​మెన్​పై పూర్తి ఆధిపత్యం వహించారు. ధావన్ 69 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా దిల్లీ 162 పరుగులకు పరిమితమైంది.

20:53 October 11

నాలుగో వికెట్​గా వెనుదిరిగిన స్టోయినిస్

నాలుగో వికెట్ కోల్పోయింది దిల్లీ. 12 పరుగులు చేసిన స్టోయినిస్ రనౌట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దిల్లీ 16.3 ఓవర్లలో 130 పరుగులు చేసింది.

20:39 October 11

మూడో వికెట్ డౌన్.. శ్రేయస్ ఔట్

మూడో వికెట్ కోల్పోయింది దిల్లీ. 42 పరుగులు చేసి ఔటయ్యాడు సారథి శ్రేయస్ అయ్యర్. ప్రస్తుతం దిల్లీ 14.4 ఓవర్లలో 109 పరుగులు చేసింది.

20:27 October 11

12 ఓవర్లకు దిల్లీ 91/2

12 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది దిల్లీ. శ్రేయస్ (33), ధావన్ (36) దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు.

20:10 October 11

8 ఓవర్లకు దిల్లీ 61/2

8 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది దిల్లీ క్యాపిటల్స్. శ్రేయస్ (16), ధావన్ (24 క్రీజులో ఉన్నారు.

20:00 October 11

6 ఓవర్లకు దిల్లీ 46/2

6 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది దిల్లీ క్యాపిటల్స్. శ్రేయస్ (10), ధావన్ (15 క్రీజులో ఉన్నారు.

19:54 October 11

రహానె​ ఔట్​

ముంబయి స్పిన్నర్​ కృనాల్​ పాండ్యా వేసిన బంతికి దిల్లీ బ్యాట్స్​మన్​ అంజిక్య రహానే(15) ఎల్బీగా వెనుదిరిగాడు. 

19:52 October 11

4 ఓవర్లకు దిల్లీ 23/1

ముంబయి ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. నాలుగు ఓవర్లకు వికెట్​ నష్టపోయిన దిల్లీ 23 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అజింక్య రహానె (15), శిఖర్​ ధావన్​(2) ఉన్నారు.

19:42 October 11

2 ఓవర్లకు దిల్లీ 17/1

తొలి ఓవర్​లోనే వికెట్​ కోల్పోయిన దిల్లీ క్యాపిటల్స్​ జట్టు ఆచితూచి ఆడుతోంది. రెండు ఓవర్లకు 17 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అజింక్య రహానె (11), శిఖర్​ ధావన్​(0) ఉన్నారు.

19:42 October 11

జట్లు:

దిల్లీ క్యాపిటల్స్​: పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్​), అలెక్స్ క్యారీ (వికెట్​ కీపర్​), మార్కస్ స్టోయినిస్, ఆక్షర్​ పటేల్, హర్షల్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే.

ముంబై ఇండియన్స్​ : క్వింటన్ డి కాక్ (వికెట్​ కీపర్​), రోహిత్ శర్మ (కెప్టెన్​), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరన్​ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా.

19:39 October 11

పృథ్వీ షా ఔట్

దిల్లీ మొదటి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసి పృథ్వీ షా ఔటయ్యాడు.

19:16 October 11

అగ్రస్థానం కోసం పోటీపడుతున్న ఇరుజట్లు

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత సీజన్​లో అత్యధిక విజయాలు సాధించిన రెండు జట్లు దిల్లీ క్యాపిటల్స్​, ముంబయి ఇండియన్స్​ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు టీమ్​లలో టాప్​ ఆర్డర్​, మిడిల్​ ఆర్డర్​, బౌలింగ్​ లైనప్​లు చాలా శక్తిమంతంగా ఉన్నాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. టాస్​ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్​ జట్టు బ్యాటింగ్​ ఎంచుకుంది. 

Last Updated : Oct 11, 2020, 11:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.