ETV Bharat / sports

అన్ని మ్యాచ్​లూ ఆడతా: ధోనీ

author img

By

Published : Oct 25, 2020, 10:05 AM IST

Updated : Oct 25, 2020, 3:04 PM IST

ఈ ఐపీఎల్​ సీజన్​లో చెన్నై జట్టు ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో జట్టు సారథిగా కొనసాగకపోవచ్చని వస్తోన్న వదంతులపై స్పందించాడు ధోనీ. అన్ని మ్యాచ్​లూ అడతానని స్పష్టం చేశాడు.

DHONI_CSK
అన్ని మ్యాచ్​లూ ఆడతా: ధోని

కెప్టెన్​గా, బ్యాట్స్​మెన్​గా మహేంద్ర సింగ్ ధోనీకిది మరిపోదగ్గ ఐపీఎల్ సీజన్. అతడి సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ప్రదర్శన చేసింది చెన్నై. 11 మ్యాచ్​ల్లో 9 పరాజయాలతో తొలిసారిగా ప్లేఆఫ్స్​కు దూరం కావడమే కాదు. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.

బ్యాట్స్​మెన్​గా ధోనీ పేలవ ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో నామమాత్రమైన మిగతా మూడు మ్యాచ్​లకు అతను దురంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ధోనr అందుకు అవకాశమే లేదన్నాడు. కెప్టెన్​గా తాను బాధ్యతల నుంచి పారిపోలేనన్నాడు.

"నేను అన్ని మ్యాచ్​లూ ఆడతా. ఎందుకంటే కెప్టెన్​గా బాధ్యతల నుంచి దూరంగా వెళ్లలేను. మా చివరి మూడు మ్యాచ్​లను వచ్చే సీజన్​కు సన్నాహకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. బ్యాట్స్​మెన్​ను, చివరి ఓవర్లలో పకడ్బందీగా బంతులేసే బౌలర్లను గుర్తించాలి. ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకోవడాన్ని అలవరుచుకుంటారని ఆశిస్తున్నా".

- ధోనీ, చెన్నై జట్టు సారథి.

Last Updated : Oct 25, 2020, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.