ETV Bharat / sports

ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి

author img

By

Published : Nov 4, 2020, 3:35 PM IST

ఐపీఎల్​లో ఈ ఏడాది ప్రతి జట్టు కనీసం 12 పాయింట్లతో లీగ్ దశను ముగించడం విశేషం. టోర్నీ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం.​

All teams finish league stage with at least 12 points for 1st time in IPL history
ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి

ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త గణాంకాలు నమోదయ్యాయి. లీగ్ దశ ముగిసేసరికి ముంబయి ఇండియన్స్ 18 పాయింట్లతో టాప్​లో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో పూర్తి దిగువన నిలిచింది. ఇలా తొలి, చివరి స్థానాల్లో ఉన్న జట్ల మధ్య 6 పాయింట్ల అంతరం ఉండటం ఇదే మొదటిసారి. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్​లో ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్​ జట్లు ప్లేఆఫ్స్​కు అర్హత సాధించాయి.

  1. ముంబయి-దిల్లీ జట్ల మధ్య గురువారం(నవంబరు 5) తొలి క్వాలిఫయర్ జరగనుంది.
  2. బెంగళూరు-హైదరాబాద్ జట్ల మధ్య శుక్రవారం(నవంబరు 6) ఎలిమినేటర్ పోరు ఉంది.
  3. క్వాలిఫయర్​లో ఓడిన జట్టు, ఎలిమినేటర్​లో గెలిచిన జట్టు మధ్య ఆదివారం(నవంబరు 8) క్వాలిఫయర్ 2, మంగళవారం(నవంబరు 10) ఫైనల్​ జరగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.