ETV Bharat / sports

అదరగొట్టిన టీమ్ఇండియా అమ్మాయిలు- తొలి రోజు ఆట పూర్తి- స్కోర్​ ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 5:44 PM IST

Updated : Dec 14, 2023, 7:56 PM IST

INDW Vs ENGW First Test Day 1 2023 : ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్ట్​లో టీమ్ఇండియా అమ్మాయిలు అదరగొట్టారు. తొలి రోజు స్కోర్​ ఎంతంటే?

INDW Vs ENGW First Test Day 1 2023
INDW Vs ENGW First Test Day 1 2023

INDW Vs ENGW First Test Day 1 2023 : ముంబయి వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత అమ్మాయిలు అద్భుతంగా రాణించారు. నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించి ఔరా అనిపించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్​ మొదటి ఇన్నింగ్స్​లో 7 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఓపెనింగ్‌లో కాస్త ఇబ్బంది పడినప్పటికీ మిగతా బ్యాటర్లు పుంజుకొని మరీ దూకుడుగా ఆడేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టింది. కేట్ క్రాస్, నా స్కైవర్​ బ్రంట్, షార్లెట్ డీన్, సోఫీ ఎస్కెల్​టోన్ ఒక్కో వికెట్ తీశారు. అయితే మహిళల టెస్టు క్రికెట్‌లో ఒకే రోజు 400కు పైగా పరుగులు సాధించడం ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు 1935లో కివీస్‌పై ఇంగ్లాండ్‌ 431/4 స్కోరు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్​ఇండియాకు శుభారంభం ద‌క్క‌లేదు. ఓపెన‌ర్లు స్మృతి మంధాన‌ (17), శెఫాలీ వ‌ర్మ‌ (19) స్వ‌ల్ప స్కోర్‌కే పెవిలియన్ చేశారు. దాంతో, క‌ష్టాల్లో ప‌డిన జట్టును శుభా స‌తీశ్ (69), జెమీమా రోడ్రిగ్స్ (68) అద్భుత ప్రదర్శన చేసి ఆదుకున్నారు. వారు య‌స్తికా భాటియా (66), దీప్తి శ‌ర్మ‌ హాఫ్​ సెంచరీలతో ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. ఆట ముగిసే స‌మ‌యానికి పూజా వ‌స్త్రాక‌ర్ (4), దీప్తి శ‌ర్మ‌ (60 *) క్రీజులో ఉంది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో లారెన్ బెల్ రెండు వికెట్ల‌తో రాణించింది.

భారత మహిళల టెస్టు జట్టు : స్మృతి మంధాన, శెఫాలీ వర్మ, శుభా సతీష్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్​ కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రేణుకా ఠాకూర్ సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.

ఇంగ్లాండ్ మహిళల టెస్టు జట్టు : టామీ బ్యూమాంట్, సోఫియా డంక్లీ, హీథర్ నైట్ (కెప్టెన్), నాట్ స్కైవర్-బ్రంట్, డేనియల్ వ్యాట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, కేట్ క్రాస్, లారెన్ ఫైలర్, లారెన్ బెల్

చరిత్ర సృష్టించిన వృందా రాఠీ- భారత తొలి మహిళా టెస్ట్​ క్రికెట్ అంపైర్​గా ఘనత

శ్రేయస్​ అయ్యర్ ఈజ్​ బ్యాక్​- KKR కెప్టెన్​గా నియామకం

Last Updated : Dec 14, 2023, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.