ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన జడేజా-కుల్‌దీప్ ద్వయం.. వన్డేల్లో తొలిసారిగా!

author img

By

Published : Jul 28, 2023, 11:27 AM IST

India Vs West Indies Odi 2023
India Vs West Indies Odi 2023

India Vs West Indies Odi 2023 : వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత స్పిన్‌ ద్వయం కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేసి అరుదైన ఘనత సాధించారు. అదేంటంటే..

India Vs West Indies Odi 2023 : వెస్టిండీస్​తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా స్పిన్నర్లు చెలరేగిపోయారు. ఏడు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్​ స్పిన్​ ద్వయం ధాటికి విండీస్​ కుప్పకూలింది. దీంతో కేవలం 23 ఓవర్లోనే వెస్టిండీస్​ చేతులెత్తేసింది. జడేజా ఆరు ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్‌ మూడు ఓవర్లలో కేవలం ఆరు పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ స్పిన్నర్లు అరుదైన ఘనత సాధించారు. ఇలా టీమ్​ఇండియా తరఫున ఒక వన్డే మ్యాచ్​లో 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్లుగా నిలిచారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

ఈ ఘనతపై కుల్‌దీప్ ఆనందం వ్యక్తం చేశారు. 'వెస్టిండీస్‌ పిచ్‌లు సీమర్లకు అనుకూలంగా ఉంటాయి. అలాంటి మైదానంలో మేమిద్దరం 7 వికెట్లు పడగొట్టడం ఆనందంగా ఉంది. ఈ పిచ్​పై బౌన్స్‌తోపాటు బంతి తిరగడం మాకు కలిసొచ్చింది. నేను నా రిథమ్‌ మీద దృష్టిపెట్టి సాధన చేశాను. సరైన ప్రాంతంలో సంధించడం వల్ల నాకు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్‌లో చాహల్‌ బరిలోకి దిగకపోయినా.. అతడు ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి. పేసర్లు ముకేశ్‌ కుమార్‌, శార్దూల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఆ తర్వాత జడేజాతో కలిసి నేను విండీస్‌ పతనంలో కీలక పాత్ర పోషించాను. పరిస్థితికి తగ్గట్టుగా గూగ్లీలను సంధించి వికెట్లను రాబట్టాను. లెఫ్ట్​హ్యాండ్​ బ్యాటర్‌ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు అతడికి దూరంగా బంతులను వేయడానికి ప్రయత్నించి సఫలమయ్యా' అని చెప్పాడు.

India Tour Of West Indies 2023 : ఇక ఈ మ్యాచ్​లో భారత్ శుభారంభం చేసింది. విండీస్ నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను ఐదు వికెట్లు కోల్పోయి 22.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఈ మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్​గా కాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్​కు దిగడం విశేషం. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.