ETV Bharat / sports

T20 Rankings: అదరగొట్టిన రాధా యాదవ్​.. స్మృతి, హర్మన్​ మళ్లీ అదే స్థానాల్లో

author img

By

Published : Jun 28, 2022, 5:06 PM IST

Women T20 rankings: మహిళా క్రికెటర్ల తాజా టీ20 ర్యాంకింగ్స్​ను ప్రకటించింది ఐసీసీ. టీమ్​ఇండియా ఆటగాళ్లు ఏఏ స్థానాల్లో నిలిచారంటే..

Women T20 Rankings
మహిళా టీ20 ర్యాంకింగ్స్​

Women T20 rankings: మహిళా క్రికెటర్ల తాజా టీ20 ర్యాంకింగ్స్​ను ప్రకటించింది ఐసీసీ. బౌలింగ్​ విభాగంలో టీమ్​ఇండియా లెఫ్ట్​ఆర్మ్​ స్పిన్నర్​ రాధాయాదవ్​ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి పదమూడో స్థానానికి చేరుకుంది. శ్రీలంకపై 2-1తేడాతో టీమ్​ఇండియా సిరీస్​ గెలవడంలో నాలుగు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించడంతో ఈ ఫీట్​ను అందుకుంది.

బ్యాటింగ్​ విభాగంలో శ్రీలంక కెప్టెన్​ చమారి ఆటపట్టు కెరీర్​ బెస్ట్​ ఏడో ర్యాంకుకు చేరింది. టీమ్​ఇండియాతో జరిగిన తాజా సిరీస్​లోని మూడు మ్యాచుల్లో మొత్తం 139 పరుగులు చేసింది. మూడో టీ20లో 80* రన్స్​తో అదరగొట్టి ఈ మార్క్​ను అందుకుంది. ఆల్​రౌండర్స్​ జాబితాలో రెండు ర్యాంకులను మెరుగుపరచుకుని ఏడో స్థానంలో నిలిచింది.

టీమ్​ఇండియా బ్యాటర్స్​ స్మృతి మంధాన(4), జెమ్మి రోడ్రిగ్స్​(14), కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్​(18) మళ్లీ అదే ర్యాంకుల్లో కొనసాగారు. బౌలింగ్​లో పూజావస్త్రాకర్ 30 ర్యాంకులను ముందుకు దాటి 32కి, రేనుకా ఠాకూర్ 83 స్థానాలు మెరుగుపరుచుకుని 97కు చేరుకున్నారు. ఇంకా ఎవరెవరు ఏఏ విభాగాల్లో ఏ స్థానాల్లో నిలిచారంటే..

ఇదీ చూడండి: రోహిత్‌ హెల్త్​పై 'సమైరా‌' అప్‌డేట్‌.. ముద్దుముద్దు మాటలతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.