ETV Bharat / sports

టీమ్​ఇండియా-వెస్టిండీస్ సిరీస్.. రెండు వేదికల్లోనే 6 మ్యాచ్​లు!

author img

By

Published : Jan 20, 2022, 9:03 AM IST

IND vs WI Series 2022: టీమ్​ఇండియా, వెస్టిండీస్ మధ్య సిరీస్​ రెండు వేదికల్లోనే నిర్వహించేందుకు బీసీసీఐ కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అహ్మదాబాద్​, కోల్​కతాలో ఆరు మ్యాచ్​లు జరగనున్నాయని తెలిపాయి.

team india
టీమ్​ఇండియా

IND vs WI Series 2022: భారత్​లో జరగనున్న టీమ్​ఇండియా, వెస్టిండీస్​ మధ్య సిరీస్​ రెండు వేదికల్లోనే నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. దేశంలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా బీసీసీఐ టూర్స్, టెక్నికల్ కమిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

"బీసీసీఐ టూర్స్, ఫిక్చర్స్ అండ్ టెక్నికల్ కమిటీ సభ్యులు బుధవారం సమావేశమయ్యారు. దేశంలో కొవిడ్​ పరిస్థితుల దృష్ట్యా.. వెస్టిండీస్​తో సిరీస్​ ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించారు. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్​లు రెండు మైదానాల్లోనే నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కోల్​కతా, అహ్మదాబాద్​ను వేదికలుగా ప్రకటించారు." అని క్రికెట్​ వర్గాలు పేర్కొన్నాయి.

మూడు వన్డేలను ఒక వేదికగా, మూడు టీ20లను మరో వేదికగా నిర్వహిస్తే బాగుంటుందని కమిటీ సభ్యులు బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.

టీమ్​ఇండియా, వెస్టిండీస్​ మధ్య ఫిబ్రవరి 6 నుంచి సిరీస్​ ప్రారంభంకానుంది. తొలుత వన్డేలు.. అహ్మదాబాద్, జైపుర్, కోల్​కతాలో.. టీ20లు కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలో నిర్వహించాలని బీసీసీఐ యోచించింది.

ఇదీ చదవండి:

IND vs SA ODI: దక్షిణాఫ్రికా చేతిలో భారత్​ ఘోర పరాజయం

U-19 World Cup: ఐర్లాండ్‌పై యువభారత్‌ ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.