ETV Bharat / sports

IND Vs WI : మూడో వన్డేలో హాఫ్​ సెంచరీలు.. ఇషాన్​ ఇలా.. సంజూ అలా..

author img

By

Published : Aug 2, 2023, 1:55 PM IST

ind vs wi 3rd odi
ind vs wi 3rd odi

IND Vs WI 3rd ODI : వెస్డిండీస్​తో జరిగిన మూడో వన్డేలో టీమ్​ఇండియా బ్యాటర్లు అదరగొట్టారు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్​ హాఫ్​ సెంచరీ చేయగా.. సంజూ శాంసన్​ కూడా తన ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. అయితే మ్యాచ్​ అనంతరం వీరిద్దరూ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేశారు. అవి వారి మాటల్లోనే తెలుసుకుందాం.

IND Vs WI 3rd ODI : వెస్డిండీస్​లో జరిగిన మూడు వన్డే సిరీస్​ను టీమ్​ఇండియా కైవసం చేసుకుంది. విండీస్​పై వరుసగా 13వ సిరీస్​ను భారత్​ నెగ్గింది. అయితే ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో బ్యాటర్​ ఇషాన్ కిషన్‌ కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ మూడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే కీలక ఇన్నింగ్స్‌లను ఆడినప్పటికీ తనకు మాత్రం సంతోషంగా లేదని ఇషాన్‌ కిషన్ వ్యాఖ్యానించాడు. ఫినిషింగ్‌ సరిగ్గా లేకపోవడం వల్ల భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నట్లు పేర్కొన్నాడు.

IND Vs WI 3rd ODI Ishan Kishan : "మూడో వన్డేలో నేను ఔటైన విధానం నాకే నచ్చలేదు. క్రీజ్‌లో పాతుకుపోయి మంచి ఇన్నింగ్స్‌ ఆడిన సమయంలో భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యా. క్రీజ్‌లో ఉండి భారీ స్కోర్లు చేయాలని నా సీనియర్లు కూడా చెబుతూ ఉంటారు. అదే విధంగా గత మ్యాచ్‌లో ఏం జరిగిందనేది మరిచిపోయి మళ్లీ ఫ్రెష్‌గా స్టార్ట్‌ చేయడం చాలా ముఖ్యం. ఇక శుభ్‌మన్‌ గిల్ సూపర్బ్‌ ప్లేయర్. బంతిని సరిగ్గా అంచనా వేసి ఆడటంలో దిట్ట. ఇలా చేయడం వల్ల నాకూ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇలాంటి కీలక మ్యాచుల్లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. భారీ స్కోరు చేసిన తర్వాత.. ప్రత్యర్థి వికెట్లను త్వరగా తీయాలని ప్రయత్నించి సఫలమయ్యాం. ఇక్కడే (పిచ్‌) నేను చాలా టోర్నీలు ఆడా. బంతి ఎలా స్పందిస్తుందో తెలుసు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. అయితే, దాని గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదు. ప్రస్తుతం రాబోయే టోర్నీలపైనే నా దృష్టంతా ఉంది. ఒకే ఒక్క టోర్నీ మన జీవితాన్ని మార్చేయగలదు" అని ఇషాన్ వ్యాఖ్యానించాడు.

భారత క్రికెటర్‌గా ఎప్పుడూ సవాళ్లే!
IND Vs WI 3rd ODI Sanju Samson : మరోవైపు, చివరి అవకాశంగా వచ్చిన మ్యాచ్‌లో భారత ఆటగాడు సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 51 పరుగులు చేసి రాణించాడు. రెండో మ్యాచ్‌లో త్వరగా పెవిలియన్‌కు చేరి విమర్శలపాలైన సంజూ.. ఈసారి మాత్రం ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తన సత్తా ఏంటో చూపించాడు.

తాజాగా విండీస్‌తో మూడో వన్డే అనంతరం సంజూ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో భారత జట్టులో స్థానం కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. "భారత క్రికెటర్‌గా ఎప్పుడూ సవాళ్లు ఉంటాయి. గత తొమ్మిదేళ్లుగా టీమ్‌ఇండియా తరపున, దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూనే ఉన్నా. అంతర్జాతీయంగా ఆడేటప్పుడు విభిన్న స్థానాల్లో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఎన్ని ఓవర్లు వస్తాయనేది చెప్పలేని పరిస్థితి. అయితే, దానికి తగ్గట్టుగా సన్నద్ధం కావాల్సిందే. మూడో వన్డేలో కాసేపు కుదురుకోవడానికి సమయం తీసుకున్నా. ఇలా చేయడం వల్ల బంతి గమనంపై అంచనా వచ్చింది. దీంతో భారత్‌ తరఫున మంచి ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం లభించింది. ప్రత్యర్థి బౌలర్‌ను బట్టి నా ప్రణాళికలు వేరుగా ఉంటాయి. బౌలర్ల లెంగ్త్‌ను డామినేట్‌ చేయడానికి నా పాదాల కదలికను మారుస్తూ ఉంటా. రెండో వన్డే ఆడిన పిచ్‌కు ఇప్పుడు ట్రినిడాడ్‌లోని పిచ్‌కు వ్యత్యాసం ఉంది. ఇక్కడ కొత్త బంతి చాలా చక్కగా బ్యాట్‌ మీదకు వచ్చింది. పరుగులు చేయడానికి వీలు కలిగింది. అయితే, బంతి పాతబడటం ప్రారంభించినప్పటి నుంచి బౌలర్లకు అనుకూలంగా మారింది. మరీ ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ మిడిలార్డర్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో భారత్‌ భారీ స్కోరు చేయగలిగింది" అని సంజూ వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.