ETV Bharat / sports

IND VS WI 2023 : విండీస్​.. అతనొక్కడే అలా!

author img

By

Published : Jul 13, 2023, 1:10 PM IST

IND VS WI first test 2023 : మొదటి టెస్టులో తొలి రోజు వెస్టిండీస్‌ ఏ మాత్రం పోరాడలేక చతికిలపడింది. అసలు ఆ ఆటగాళ్ల ఆటతీరు ఎలా ఉందో చూద్దాం..

IND VS WI
IND VS WI : విండీస్​.. ఇలా అయితే కష్టమే!

IND VS WI first test 2023 : అనుకున్నట్టే జరిగింది. మొదటి టెస్టులో తొలి రోజు వెస్టిండీస్‌ ఏ మాత్రం పోరాడలేకపోయింది. యంగ్ ప్లేయర్​ అలిక్ అథనేజ్‌ (47)ను మినహా మిగిలిన ఆటగాళ్లు చేతులెత్తేశారు. అతడు హాఫ్ సెంచరీ మిస్‌ చేసుకున్నప్పటికీ.. బ్యాటింగ్ అద్భుతం చేశాడు. అతడి ఆటతీరు భవిష్యత్త్​లో కీలక ఆటగాడిగా ఎదుగుతాడనే నమ్మకాన్ని కలిగించింది.

బ్యాటింగ్ ఇలా..

  • భారత్‌ బౌలింగ్‌ పటిష్ఠంగా ఉందని తెలిసినప్పటికీ.. విండీస్ బ్యాటర్లు సహనం ప్రదర్శించలేకపోయారు.
  • అశ్విన్‌ దెబ్బకు బాగా రాణస్తాడనుకున్న యంగ్ బ్యాటర్ త్యాగ్‌నారాయణ్‌ (12) బౌల్డ్ అయ్యాడు.
  • ఇక నిలకడగా ఆడుతూ జట్టును కాపాడాల్సింది పోయి.. చెత్త షాట్ ఆడి ఔట్​ అయ్యాడు కెప్టెన్ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్ (20). జట్టులో అతడొక్కడే సీనియర్ కూడా. బాధ్యతారహితంగా ఆడాడు.
  • బ్లాక్‌వుడ్‌, జాసన్‌ హోల్డర్‌ కాసేపు భారత బౌలర్లకు విసిగించినా.. కీలక సమయంలో చేతులెత్తేశారు. ఒక్క అలిక్‌ అథనేజ్‌ కాస్త రాణించడం వల్లే.. 150 స్కోరు చేసింది.

బౌలింగ్‌ తుస్సు..

  • భారత బౌలర్లు ఎంత బాగా రాణించారో అదే పిచ్​పై విండీస్ బౌలర్లు చేతులెత్తేశారు. మ్యాచ్‌ ముందుకు సాగే కొద్దీ పిచ్​.. స్పిన్‌కు అనుకూలంగా మారిందని అశ్విన్ చెప్పాడు కూడా. మరి అలాంటి పిచ్‌పై విండీస్‌ స్పిన్నర్లు కార్న్‌వాల్‌, వారికాన్‌ ప్రభావం చూపలేకపోయారు. భారత ఓపెనర్లు యశస్వి, రోహిత్ శర్మ నిలకడగా పరుగులు సాధించారు.
  • విండీస్‌ పేసర్లు కీమర్‌ రోచ్, జాసన్ హోల్డర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ.. వికెట్‌ తీయలేకపోయారు.
  • ఇక అల్జారీ జోసెఫ్‌.. ఐదు ఓవర్లోనే 25 పరుగులు సమర్పించుకున్నాడు. అలా విండీస్ బౌలర్లు.. భారత ఓపెనర్లను కట్టడి చేయలేకపోయారు. దీంతో తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ వికెట్​ కోల్పోకుండా ఆడింది. క్రీజులో రోహిత్, యశస్వి ఉన్నారు.

మొత్తంగా.. విండీస్‌ క్రికెట్‌కు పూర్వ వైభవం అందుకోవాలని ఆ దేశ మాజీలు ఆశిస్తుంటే.. యంగ్ ప్లేయర్స్​ మాత్రం అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. త్యాగ్‌నారాయణ్‌ చంద్రపాల్, రీఫెర్, జోషువా అందరూ ఫెయిల్ అవుతున్నారు. స్వదేశంలోనే వారు రాణించలేకపోతే.. విదేశాల్లో కూడా కష్టం అవుతుంది. అథనేజ్‌ను స్ఫూర్తిగా చూసి అక్కడి యంగ్‌ క్రికెటర్లు ఆడాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పటికైనా విండీస్ ప్లేయర్స్ అంతా విజృంభించి ఆడితేనే ఘోర ఓటమిని నుంచి తప్పించుకోవచ్చు.

ఇదీ చూడండి :

అశ్విన్​.. అప్పుడు తండ్రిపై.. ఇప్పుడు కొడుకుపై.. తొలి రోజు మ్యాచ్​ హైలైట్స్​ ఇవే

IND vs WI : అశ్విన్​ మాయ.. రికార్డ్స్​తో హోరు​.. తొలి రోజు భారత్​దే.. విండీస్ విలవిల..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.