ETV Bharat / sports

IND vs WI : అశ్విన్​ మాయ.. రికార్డ్స్​తో హోరు​.. తొలి రోజు భారత్​దే.. విండీస్ విలవిల..

author img

By

Published : Jul 13, 2023, 6:31 AM IST

Updated : Jul 13, 2023, 9:32 AM IST

ind vs wi first test 2023 : వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో.. మొదటి రోజు భారత్‌ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్.. మరోసారి ఐదు వికెట్లతో సత్తాచాటగా, మరో స్పిన్నర్‌ జడేజా మూడు వికెట్లతో రాణించాడు. మ్యాచ్ వివరాలు..

IND VS WI
IND vs WI first test 2023 : అశ్విన్​ మాయ.. విండీస్ విలవిల.. తొలి రోజు భారత్​దే

ind vs wi first test 2023 : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. మొదటి రోజు భారత్‌ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్​ జట్టును.. 150 పరుగులకే ఆలౌట్‌ చేసింది. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్.. మరోసారి ఐదు వికెట్లతో సత్తాచాటగా, మరో స్పిన్నర్‌ జడేజా మూడు వికెట్లతో రాణించాడు. వెస్టిండీస్‌ బ్యాటర్లలో..అలిక్ అథనజే 47 పరుగులు మినహా...ఒక్క బ్యాటర్‌ కూడా చెప్పుకొదగిన పరుగులు చేయలేకపోయారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ జట్టుకు... ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్‌... మంచి ఆరంభాన్ని అందించారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ జట్టు ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా.. 80 పరుగులు చేసింది. రోహిత్ 30, జైస్వాల్‌ 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

తండ్రీకొడుకులిద్దరినీ.. మొదటి రోజు ఆటలో సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో తండ్రీకొడుకులిద్దరినీ ఔట్‌ చేసిన ఐదో బౌలర్‌గా ఘనత సాధించాడు. విండీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ను బౌల్డ్‌ చేసి ఈ మార్క్​ను అందుకున్నాడు. 2011లో దిల్లీ వేదికగా జరిగిన టెస్ట్​ మ్యాచ్​తో అరంగేట్రం చేసిన అశ్విన్‌.. ఆ మ్యాచ్‌లో త్యాగ్‌నారాయణ్‌ తండ్రి శివ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ను ఔట్‌ చేయడం విశేషం. అప్పుడు అశ్విన్​.. శివన్​ నారాయణ్​ చందర్‌పాల్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. ఇకపోతే మిచెల్‌ స్టార్క్‌(ఆస్ట్రేలియా), సిమోన్‌ హార్మర్‌ (దక్షిణాఫ్రికా) కూడా త్యాగ్‌నారాయణ్‌, అతడి తండ్రి శివ్‌నారాయణ్‌లను ఔట్‌ చేసి తండ్రీకొడుకులిద్దరినీ పెవిలియన్ చేర్చిన ఘనత అందుకున్నారు.

అనిల్ రికార్డ్​ బ్రేక్​.. త్యాగ్‌ నారాయణ్‌ చందర్‌పాల్‌ను ఔట్​ చేసిన అశ్విన్​.. టెస్టుల్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక సార్లు వికెట్లు బౌల్డ్‌ చేసిన బౌలర్​గా నిలిచాడు. అలా దిగ్గజ స్నిన్నర్​ అనిల్‌ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అనిల్‌ కుంబ్లే 94 సార్లు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బౌల్డ్‌ చేశాడు. అశ్విన్‌.. చందర్‌పాల్‌ వికెట్‌తో 95 సార్లు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బౌల్డ్​ చేశాడు. ఇక మహ్మద్‌ షమీ 66 సార్లు, కపిల్‌ దేవ్‌ 88 సార్లు ఇలా బౌల్డ్​ చేశారు.

అశ్విన్‌ @ 700

ఇకపోతే అశ్విన్‌ 700వ అంతర్జాతీయ వికెట్‌ సాధించడం విశేషం. అల్జారి జోసెఫ్‌ను ఔట్‌ చేసి.. ఈ మార్క్​ను అందుకున్నాడు. భారత్‌ తరఫున ఇప్పటి వరకు అనిల్‌ కుంబ్లే (953), హర్భజన్‌ సింగ్‌ (707) మాత్రమే ఈ అరుదైన ఫీట్​ను అందుకున్నారు.

ఇదీ చూడండి :

విరాట్​ను ఎక్కువ సార్లు ఔట్​ చేసిన 'విండీస్​' బౌలర్​ ఎవరో తెలుసా?

రోహిత్​ టు రహానే.. విండీస్​ టెస్ట్​లో టాప్​-5 కీలక ప్లేయర్స్​ వీరే..

Last Updated :Jul 13, 2023, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.