ETV Bharat / sports

వన్డే ప్రపంచ కప్​పై హార్దిక్​ కామెంట్స్​.. కుందేలులా కాదు.. తాబేలులా వెళ్లాలంటూ..

author img

By

Published : Jul 30, 2023, 9:24 AM IST

WI vs IND 2023 second ODI : రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకుండా విండీస్​తో రెండో వన్డే ఆడేందుకు టీమ్​ఇండియా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లో వారికి ఓటమి తప్పలేదు. మ్యాచ్​ తర్వాత ఓటమిపై మాట్లాడిన హార్దిక్​.. వన్డే ప్రపంచకప్​ గురించి కూడా మాట్లాడాడు.. ​

వన్డే ప్రపంచ కప్​పై హార్దిక్​ కామెంట్స్
వన్డే ప్రపంచ కప్​పై హార్దిక్​ కామెంట్స్

WI vs IND 2023 second ODI : రెండో వన్డేలో టీమ్​ఇండియా ఎదురుదెబ్బ తగిలింది. విండీస్‌ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు. కేవలం ఓపెనర్లు మాత్రమే కాస్త రాణించారు. దీంతో భారత జట్టు 181 పరుగులకే కుప్పకూలిపోయింది.

"బ్యాటింగ్‌లో అనుకున్న విధంగా చేయలేకపోయాం. మొదటి​ వన్డేతో పోలిస్తే.. ఈ మ్యాచ్‌ పిచ్‌ బాగుంది. మంచిగా ఆడలేకపోవడం.. నిరుత్సాహానికి గురి చేసింది. కానీ కచ్చితంగా ఇలాంటి ఓటముల నుంచి పాఠాలను నేర్చుకుంటాము. మా ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. కానీ మేము దాన్ని కొనసాగించలేకపోయాం. నేను మరిన్ని ఓవర్లు బౌలింగ్ వేయాల్సింది. వన్డే ప్రపంచ కప్‌ సయానికి సిద్ధం అవ్వాలంటే బౌలింగ్‌లో మరింతా బాగా శ్రమించాలి. కుందేలులాగా కాకుండా తాబేలులా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్లాలి. ప్రపంచకప్ కల్లా సిద్ధమవుతానని ఆశిస్తున్నాను. ప్రస్తుతం సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచాం. చివరి మ్యాచ్‌ మరింత ఆసక్తికరంగా సాగుకతుందని భావిస్తున్నాను" అని పాండ్య పేర్కొన్నాడు.

"ఈ మ్యాచ్​లో విజయం సాధించడం సంతోషంగా ఉంది. నేను అర్ధశతకం లేదా శతకం బాదిన మా జట్టు గెలుస్తుంది. ఇలాంటి వికెట్​పై పరుగులు సాధించాలంటే చాలా జాగ్రత్తగా ఆడగలగాలి. టీమ్​ఇండియా వంటి పటిష్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. ప్రస్తుతం ఒక మ్యాచ్‌ విజయం సాధించాం. కానీ తర్వాతి మ్యాచ్​లోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంటాం. మా ప్లేయర్స్​ చాలా కష్టపడ్డారు. మేం ఎలా ఆడాలని అనుకున్నామో దాన్నే మైదానంలో ప్రదర్శించాం. పిచ్‌ నుంచి గట్టి సవాల్‌ ఎదురైంది. అయినా బాగా ఆడి విజయం సాధించాము. తప్పకుండా సిరీస్‌ను గెలుస్తామనే నమ్మకం" అని వెస్టిండీస్​ కెప్టెన్‌ షై హోప్‌ అన్నాడు.

కాగా, 182 పరుగుల లక్ష్యాన్ని టీమ్​ఇండియా ఛేదించలేకోపోయింది. బౌలర్లు ఫెయిల్​ అయ్యారు. ఆట ప్రారంభంలో శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్‌ వికెట్లను తీశారు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్య, ఇతర బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు. ఇక ఈ మ్యాచ్​లో విండీస్ కెప్టెన్​ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు. అలాగే గత పది వన్డేల తర్వాత టీమ్​ఇండియాపై వెస్టిండీస్​కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం.

ఇదీ చూడండి :

IND VS WI 2023 : టీమ్‌ఇండియాకు భంగపాటు.. రెండో వన్డేలో విండీస్​ విజయం

Ashes 2023 : జెర్సీలు మార్చుకొని తికమక పెట్టిన ఆతిథ్య జట్టు.. దీని వెనక అంత కథ ఉందా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.