ETV Bharat / sports

IND vs SA: 'ఆ విజయం యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపింది'

author img

By

Published : Jan 9, 2022, 5:45 AM IST

elgar
ఎల్గర్

IND vs SA: టీమ్​ఇండియాతో రెండో టెస్టులో విజయం సాధించడంపై స్పందించాడు దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్. ఈ గెలుపు యువ ఆటగాళ్లలో నమ్మకం నింపిందని అన్నాడు. మూడో టెస్టులోను రెట్టింపు ఉత్సాహంతో ఆడి సిరీస్​ గెలుస్తామని అన్నాడు.

IND vs SA: వాండరర్స్‌ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియాను ఓడించడం ద్వారా.. యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ అన్నాడు. చివరి టెస్టులో కూడా అదే ఊపుతో రాణించి సిరీస్ సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు కొత్తవాళ్లే. వాండరర్స్ మైదానంలో టీమ్‌ఇండియా లాంటి బలమైన జట్టును ఓడించడంతో.. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. త్వరలో ప్రారంభం కానున్న సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టులో కూడా ఇదే ఊపుతో మెరుగ్గా రాణించాలనుకుంటున్నాం. కేప్‌టౌన్‌లో జరుగనున్న చివరి టెస్టులో విజయం సాధించాలంటే.. పక్కా ప్రణాళికతో ఆడాలి. సమష్టిగా పోరాడితే.. పై చేయి సాధించడం సులువే"

-- డీన్‌ ఎల్గర్‌, దక్షిణాఫ్రికా కెప్టెన్.

ఆటగాళ్లు పుంజుకున్న తీరు అద్భుతం..

టీమ్‌ఇండియాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టులో ఓడిపోయినా.. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పుంజుకున్న తీరు అద్భుతమని ఆ దేశ మాజీ ఆటగాడు వెర్నాన్ ఫిలాండర్‌ అన్నాడు. 'దక్షిణాఫ్రికా జట్టు ఇటీవల చేసిన అత్తుత్తమ ప్రదర్శన ఇదే. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్ బ్యాట్‌తో గొప్పగా పోరాడాడు. మా ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్‌లో కూడా మెరుగ్గానే రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తి ఆదిపత్యం చెలాయించారు. రెండో టెస్టులో మా బ్యాటర్లు ధాటిగా ఆడారు. ఇది భారత బౌలర్లను ఆశ్చర్యానికి గురి చేసి ఉండొచ్చు. బ్యాటర్లు ఎదురు దాడి చేస్తారని వారు ఊహించి ఉండకపోవచ్చు. బౌలర్లు ఒత్తిడి పెంచడానికి ప్రయత్నించినప్పుడు.. బ్యాటర్లు ఎదురుదాడి చేయటమే సరైన పద్దతి. రెండో టెస్టులో టాస్‌ ఓడిపోయినా.. మా ఆటగాళ్లు పుంజుకున్న తీరు అద్భుతం. భారత్‌ని స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేయడంలో సఫలం అయ్యారు. రెండో టెస్టులో సాధించిన విజయం ఆటగాళ్లలో మరింత ఆత్మ విశ్వాసం నింపింది' అని వెర్నాన్‌ ఫిలాండర్‌ పేర్కొన్నాడు. సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టు కేప్ టౌన్‌ వేదికగా జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు చెరో టెస్టులో విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేశాయి.

ఇదీ చదవండి:

IND Vs SA: పంత్​పై గంభీర్​ ఫైర్​

IND vs SA 2nd Test: ఎల్గర్​ సూపర్ ఇన్నింగ్స్​- విజయం సౌతాఫ్రికాదే

ఓటమికి రాహుల్​ను నిందించడం సరికాదు: కనేరియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.