ETV Bharat / sports

Ind vs Pak World Cup 2023 : టీమ్ఇండియా ఫ్యాన్స్​పై పాక్​ బోర్డు గుస్సా.. ఐసీసీకి ఫిర్యాదు?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 5:49 PM IST

Updated : Oct 16, 2023, 6:00 PM IST

Ind vs Pak World Cup 2023 : 2023 ప్రపంచకప్​లో భాగంగా జరిగిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్​లో టీమ్ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ జరుగుతుండగా.. స్టేడియంలోని ప్రేక్షకుల ప్రవర్తనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీకి ఫిర్యాదు చేయనుందట!

Ind vs Pak World Cup 2023
Ind vs Pak World Cup 2023

Ind vs Pak World Cup 2023 : 2023 ప్రపంచకప్​ అహ్మదాబాద్​ వేదికగా జరిగిన భారత్ - పాకిస్థాన్​ మ్యాచ్​లో.. టీమ్ఇండియా ఫ్యాన్స్​ ప్రవర్తన పట్ల పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్షా 30 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న నరేంద్రమోదీ స్టేడియం.. మొత్తం టీమ్ఇండియా ఫ్యాన్స్​తో నిండిపోయింది. వారంతా మ్యాచ్​ మొదలైనప్పటి నుంచి అరుస్తూ.. పాక్​​ ప్లేయర్లను ఒత్తిడిలోకి నెట్టారని పీసీబీ ఆరోపిస్తోంది. ఈ విషయంపై పీసీబీ.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగింది ? టాస్​ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడేటప్పుడు.. మైదానంలోని ఆడియోన్స్ గట్టిగా అరిచారు. ఇక మ్యాచ్​ జరుగుతుండగా.. 33.6 ఓవర్ల వద్ద పేసర్ జస్​ప్రీత్ బుమ్రా బౌలింగ్​లో.. పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔటయ్యాడు. దీంతో అతడు క్రీజును వీడి, డ్రెసింగ్ రూమ్​ వైపు వెళ్తుండగా.. స్టేడియంలోని ఫ్యాన్స్​ మతపరమైన స్లోగన్స్​ ఇచ్చారు. అయితే ఇందంతా పాక్​ క్రికెట్ బోర్డుకు నచ్చకపోవడం వల్ల ఐసీసీకు కంప్లైంట్ చేయాలని నిర్ణయించుకుందట. ఈ విషయంపై పీసీబీ చీఫ్ జాకా అష్రఫ్.. సోమవారం లాహోర్​ చేరుకున్నాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఇంగ్లీష్ మీడియా కథనాల్లో పేర్కొంది.

ఇక మ్యాచ్​ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పాకిస్థాన్.. 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజామ్ (50), రిజ్వాన్ (49) మాత్రమే రాణించారు. ఇక బుమ్రా, సిరాజ్, పాండ్య, కుల్​దీప్, జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం టీమ్ఇండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు ఛేదించింది. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (86), శ్రేయస్ అయ్యర్ (53*) అర్ధ శతకాలతో రాణించారు.

పాకిస్థాన్ @ హైదరాబాద్ : అయితే ఇదే టోర్నమెంట్​లో పాకిస్థాన్.. వార్మప్ మ్యాచ్​లతో సహా, రెండు గ్రూప్ మ్యాచ్​లు హైదరాబాద్​ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడింది. అహ్మదాబాద్​తో పోలిస్తే.. హైదరాబాద్​లో పాక్​కు క్రౌడ్​ నుంచి కొంచెం మద్దుతు లభించింది. ఇక ఇదే మైదానంలో పాక్​.. శ్రీలంకపై 345 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించింది.

  • PCB should file an official complaint to the ICC against this bigotry. Protest against this behavior & threaten to leave if this continues at other venues as this clearly is a safety concern going forward.

    But sadly Zaka doesn't have the balls for this. https://t.co/z2fSRJXVo6

    — khan (@TheOGKhan) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Wasim Akram on Babar : 'కోహ్లీ జెర్సీలు అక్కడే తీసుకోవాలా?'​.. బాబర్​పై అక్రమ్​ ఫైర్​

ODI World Cup 2023 IND VS PAK : ఆ మజా మళ్లీ దొరకదా?.. భారత్ - పాక్ మ్యాచుల్లో కిక్ ఏది బాసూ!

Last Updated : Oct 16, 2023, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.