ETV Bharat / sports

NZ vs IND: మ్యాచ్‌ వర్షార్పణం.. కివీస్‌దే సిరీస్‌

author img

By

Published : Nov 30, 2022, 2:51 PM IST

Updated : Nov 30, 2022, 3:39 PM IST

IND VS NZ Third ODI cancelled
NZ vs IND: మ్యాచ్‌ వర్షార్పణం.. కివీస్‌దే సిరీస్‌

14:49 November 30

మ్యాచ్‌ వర్షార్పణం

మూడో వన్డే మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత్‌పై మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 1-0 తేడాతో కైవసం చేసుకొంది. తొలి వన్డేను కివీస్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. మూడో వన్డే మ్యాచ్‌లో ఇంకో రెండు ఓవర్ల ఆట జరిగి ఉంటే డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం న్యూజిలాండ్‌ విజయం సాధించేది.

కానీ వర్షం రావడంతో మ్యాచ్‌ 18 ఓవర్ల వద్దే నిలిపేశారు. అప్పటికి కివీస్‌ 104/1 స్కోరుతో ఉంది. డక్‌ వర్త్‌ అమలు చేయాలంటే వన్డేల్లో ఒక్కో ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్ల ఆట జరిగి ఉండాలి. కానీ వర్షం ఆగకపోవడంతో మూడో వన్డేను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 219 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ఇంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ కూడా ఇలానే వర్షం కారణంగా అంతరాయాలతోనే భారత్‌ 1-0 తేడాతో సొంతం చేసుకొంది. కాగా, తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన టామ్‌ లాథమ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది.

రాణించిన వాషింగ్టన్‌.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్ (51: 64 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌) అర్ధశతకం సాధించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసి భారత్‌ ఓ మాదిరి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సుందర్‌ కాకుండా శ్రేయస్‌ అయ్యర్ (49) రాణించగా.. శిఖర్ ధావన్ (28) ఫర్వాలేదనిపించాడు. కివీస్‌ బౌలర్లలో డారిల్ మిచెల్ 3, టిమ్‌ సౌథీ 2.. లాకీ ఫెర్గూసన్, మిచెల్‌ సాంట్నర్ చెరో వికెట్‌ తీశారు.
ఇదీ చూడండి: 'రాయుడుకు జరిగిన అన్యాయమే ఇప్పుడు సంజూకు..'

Last Updated :Nov 30, 2022, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.