INDvsNZ Test: ప్రాక్టీస్​లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు

author img

By

Published : Nov 23, 2021, 10:04 PM IST

Team India

న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​(IND vs NZ test series 2021) కోసం ప్రాక్టీస్ షురూ చేసింది టీమ్ఇండియా. గురువారం కాన్పుర్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్(IND vs NZ t20 series 2021)​ను క్లీన్​స్వీప్ చేసిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్​పై కన్నేసింది. గురువారం భారత్-న్యూజిలాండ్​ల మధ్య తొలి టెస్టు(IND vs NZ 1st test) ప్రారంభంకానుంది. కాన్పుర్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్​ కోసం ప్రాక్టీస్​ను షురూ చేసింది టీమ్ఇండియా. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో స్వేదం చిందించారు ఆటగాళ్లు. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేసింది బీసీసీఐ(Board of Cricket Control in India).

టీ20 ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ కివీస్​తో జరిగిన టీ20 సిరీస్​తో పాటు గురువారం ప్రారంభమయ్యే తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకు ఇతడు అందుబాటులోకి రానున్నాడు. అలాగే టీ20 సిరీస్​లో పాల్గొన్న రోహిత్ శర్మ, పంత్, షమీలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ టెస్టు మ్యాచ్​కు రహానే సారథ్యం వహించనుండగా.. పుజారా వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రాహుల్​కు గాయం కారణంగా సూర్యకుమార్​ను జట్టులోకి తీసుకుంది యాజమాన్యం.

Team India Squad for New Zealand Test: రహానే (కెప్టెన్), పుజారా, మయాంక్ అగర్వాల్, గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సాహా, కేఎస్ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇవీ చూడండి: ప్రాక్టీస్​లో కోహ్లీ.. పిల్లితో సరదాగా కాసేపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.