ETV Bharat / sports

Ind Vs Ban Asia Cup : వీరికి రెస్ట్​.. వారికి ఛాన్స్​.. భారత్​- బంగ్లా మ్యాచ్​లో కీలక మార్పులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 3:30 PM IST

Ind Vs Ban Asia Cup : ఆసియా కప్​లో భాగంగా జరగనున్న ఫైనల్స్​లో ఆడేందుకు టీమ్ఇండియా అర్హత సాధించింది. అయితే శుక్రవారం బంగ్లాదేశ్​తో జరగనున్న సూపర్​ 4 మ్యాచ్​లో రోహిత్​ సేన తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​లో భారత జట్టులో కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగబోతుందట. ఆ వివరాలు..

Ind Vs Ban Asia Cup : ముగ్గురికి రెస్ట్​.. ఆ ముగ్గురికి ఛాన్స్​.. భారత్​- బంగ్లా మ్యాచ్​లో కీలక మార్పులు!
Ind Vs Ban Asia Cup : ముగ్గురికి రెస్ట్​.. ఆ ముగ్గురికి ఛాన్స్​.. భారత్​- బంగ్లా మ్యాచ్​లో కీలక మార్పులు!

Ind Vs Ban Asia Cup : ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన రోహిత్​ సేన.. ఈ టోర్నీలో ఫైనల్స్​కు చేరిన తొలి టీమ్​గా రికార్డుకెక్కింది. ఈ క్రమంలో రానున్న లీగ్​ దశలో తమ చివరి మ్యాచ్​ను బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్​.. తుది జట్టులో కీలక మార్పులతో బరిలో దిగబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చేందుకు మేనేజ్‌మెంట్‌ ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం అందింది. కీలక ఆటగాళ్లపై పనిభారాన్ని తగ్గించడంతో పాటు రానున్న ప్రపంచ కప్​ కోసం ఇతర ప్లేయర్ల సన్నద్ధతను పరీక్షించేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకుందట.

మరోవైపు కొలంబో వేదికగా జరిగిన భారత్​-​ పాకిస్థాన్ సూపర్‌-4​ మ్యాచ్.. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగింది. ఆదివారం మొదలైన మ్యాచ్‌.. భారత్​ గెలుపుతో సోమవారం ముగిసింది. అయితే ఇందులో గెలుపొందిన రోహిత్‌ సేన.. మళ్లీ 15 గంటల్లో శ్రీలంకతో మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది. అయితే అక్కడ కూడా మన ప్లేయర్లు సత్తా చాటి ఫైనల్స్​లోకి ఎంట్రీ ఇచ్చేశారు.

ఆ ముగ్గురికి విశ్రాంతి అవసరం..
Rohit Sharma Asia Cup 2023 : అయితే వరుసగా మూడు రోజుల పాటు రోహిత్​ సేనకు తగినంత విశ్రాంతి దొరకనందున ఆ ప్రభావం క్రికెటర్లపై ఉండనుందని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఓపెనర్​గా దిగిన కెప్టెన్​ రోహిత్​కు ఇది అదనపు భారం. అంతే కాకుండా తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఇలా వెనువెంటనే వన్డే ఆడటం ఇదే తొలిసారి అంటూ ఇటీవలే విరాట్​ కూడా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తన శరీరానికి కావాల్సినంత విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడు.

మరోవైపు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఇప్పటికే టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడటం లేదు. దీంతో వీరిద్దరిని దృష్టిలో ఉంచుకుని వన్డే వరల్డ్‌కప్​కు ముందే మేనేజ్‌మెంట్‌ వీరికి విశ్రాంతినిచ్చేందుకు ప్లాన్​ చేస్తోంది. ఇక వీరిద్దరితో పాటు జస్‌ప్రీత్‌ బుమ్రాకు కుడా రెస్ట్ ఇవ్వాలని మేనేజ్​మెంట్​ భావిస్తోందట.

ఈ క్రమంలో ఒకవేళ రానున్న మ్యాచ్​కు రోహిత్‌ దూరమైతే అతని స్థానంలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్​గా బాధ్యతలు చేపడతాడు. ఇక తన ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఈ మ్యాచ్​తో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మిస్టర్​ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా రానున్న మ్యాచ్​లో ఆడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బుమ్రాకు రెస్ట్ ఇస్తే.. అతని ప్లేస్​లో మహ్మద్‌ షమీ తుది జట్టులోకి రావొచ్చు.

Asia Cup Team India Final Squad : ఇదిలా ఉండగా.. రోహిత్​ ప్లేస్​లో శుభ్​మన్​ గిల్‌కు జోడీగా ఇషాన్‌ కిషన్‌ వస్తే.. మూడో స్థానంలో సూర్యకుమార్​.. నాలుగో స్థానంలో శ్రేయస్​.. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ టాప్‌-8లో బ్యాటింగ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Asia Cup 2023 Stats : మినీ టోర్నీలో మనోళ్ల డామినేషన్.. రోహిత్, కుల్​దీప్ టాప్​

Asia Cup 2023 IND VS PAK : అదే జరిగితే మూడోసారి భారత్-పాక్ మ్యాచ్ కన్ఫార్మ్! సమీకరణాలు ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.