ETV Bharat / sports

Asia Cup 2023 IND VS PAK : అదే జరిగితే మూడోసారి భారత్-పాక్ మ్యాచ్ కన్ఫార్మ్! సమీకరణాలు ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 5:32 PM IST

Updated : Sep 13, 2023, 7:31 PM IST

Asia Cup 2023 IND VS PAK : ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్​లో ఇండోపాక్ మ్యాచ్ టోర్నీకే హైలైట్​గా నిలిచింది. ఈ టోర్నీలో ఇరుజట్లు ఇప్పటికే రెండుసార్లు తలపడగా.. మొదటిది వర్షం కారణంగా రద్దైంది. రెండో పోరులో భారత్ ఘన విజయం సాధించింది. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే టోర్నీలో మూడోసారి దాయాదుల పోరు కన్ఫార్మ్. అది ఎలాగంటే

Asia Cup 2023 IND VS PAK : అదే జరిగితే మూడోసారి భారత్-పాక్ మ్యాచ్ కన్ఫార్మ్! సమీకరణాలు ఎలా ఉన్నాయంటే?
Asia Cup 2023 IND VS PAK : అదే జరిగితే మూడోసారి భారత్-పాక్ మ్యాచ్ కన్ఫార్మ్! సమీకరణాలు ఎలా ఉన్నాయంటే?

Asia Cup 2023 IND VS PAK : భారత్ - పాకిస్థాన్ మ్యాచ్​కు ఉన్న క్రేజే వేరు. ఈ ఇరు జట్ల మధ్య పోరు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్​ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. అయితే ప్రస్తుతం 2023 ఆసియా కప్​లో ఇప్పటికే భారత్-పాకిస్థాన్ జట్లు రెండు సార్లు తలపడిన సంగతి తెలిసిందే. అయితే లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్​ రద్దవ్వగా.. సూపర్ 4 మ్యాచ్​లో పాకిస్థాన్​పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకున్నారు. ఇక శ్రీలంకపై విజయంతో టోర్నీలో ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది భారత్​. అయితే టీమ్​ఇండియా.. మూడోసారి కూడా పాక్​ను ఢీ కొట్టే ఛాన్స్ ఉంది. అదెలాగంటే తెలుసుకుందాం..

Asia Cup 2023 Points Table Super 4 : సూపర్‌ 4 దశలో రెండు వరుస విజయాలతో భారత్ 4 పాయింట్లతో టాప్​లో ఉంది. శ్రీలంక, పాకిస్థాన్ రెండేసి మ్యాచ్​లు ఆడి.. ఒక్కొక్కటి నెగ్గి వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక రెండు మ్యాచ్​లు ఓడిన బంగ్లాదేశ్.. టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించింది. అయితే సూపర్​ 4 లో తరువాతి మ్యాచ్ పాకిస్థాన్-శ్రీలంక మధ్య సెప్టెంబర్ 14న గురువారం జరగనుంది. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు ఫైనల్​లో భారత్​ను ఢీ కొడుతుంది.

ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. పాకిస్థాన్​కు ఎదురుదెబ్బ తగులుతుంది. ఎందుకంటే మ్యాచ్​ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అలా జరిగితే 3 పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉంటాయి. కాన్నీ పాక్​ కంటే ఎక్కువ రన్​రేట్ ఉన్న కారణంగా శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అందుకే పాకిస్థాన్ ఫైనల్ చేరాలంటే.. కచ్చితంగా మ్యాచ్​ జరిగి శ్రీలంకపై నెగ్గాలి. అదే జరిగితే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ముచ్చటగా మూడోసారి ఇండోపాక్ మ్యాచ్​ను చూడవచ్చనని ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

  • India's exciting 41-run win last night propelled them into the Asia Cup 2023 finals. Tomorrow, Pakistan and Sri Lanka will vie for the second spot, determining India's opponent in the championship match! 💪#AsiaCup2023 pic.twitter.com/wuWFNoeRCJ

    — AsianCricketCouncil (@ACCMedia1) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Kohli 300 Victories : కోహ్లీ ఖాతాలో మరో అత్యంత అరుదైన రికార్డ్​.. ఈ సారి ఏకంగా..

ICC ODI Rankings 2023 : గిల్ ప్లేస్​ నో ఛేంజ్.. మెరుగైన రోహిత్.. కోహ్లీ సెంచరీ కొట్టినా డౌన్

Last Updated :Sep 13, 2023, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.