ETV Bharat / sports

Ind vs Aus ODi 2023 : టాప్​లేపిన టీమ్ఇండియా.. మామూలు బీభత్సం కాదుగా..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 6:15 PM IST

Updated : Sep 24, 2023, 7:18 PM IST

Ind vs Aus ODi 2023
Ind vs Aus ODi 2023

Ind vs Aus ODi 2023 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ముగింసింది. ఓవర్లన్నీ ఆడిన టీమ్ఇండియా ఎన్ని పరుగులు చేసిందంటే?

Ind vs Aus ODi 2023 : ఇందౌర్ హోల్కర్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లు.. శుభ్​మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో చెలరేగిన వేళ.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (52), సూర్యకుమార్ యాదవ్ (72*) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2, జోష్ హజెల్​వుడ్, సీన్ అబాట్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు. ఇక వన్డేల్లో ఆసీస్​పై.. భారత్​కు ఇదే అత్యధిక స్కోర్. ఇంతకు ముందు 2013లో బెెంగళూరులో జరిగిన మ్యాచ్​లో భారత్ 383 పరుగులు చేసింది. అదే మ్యాచ్​లో ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(209) .. తొలి డబుల్ సెంచరీ సాధించాడు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఆదిలోనె ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్​ సెన్సేషన్ రుతురాజ్ గైక్వాడ్ (8) పరుగులకే ఔటయ్యాడు. ఇక ఆసీస్​ బౌలర్లకు అవే చివరి సంబరాలు అయ్యాయి. వన్​ డౌన్​లో క్రీజులకి వచ్చిన అయ్యర్​.. గిల్​తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేశారు. ఇక రెండో వికెట్​కు 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో భారత్ తరఫున రెండో వికెట్​కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఆటగాళ్లలో ఈ జోడీ చేరింది.

మరోవైపు కెప్టెన్ రాహుల్ కూడా.. తన ఫామ్​ను కొనసాగించాడు. ఆసియా కప్​లో కమ్​బ్యాక్​ ఇచ్చిన అతడు.. నిలకడగా ఆడుతున్నాడు. ఇదే సిరీస్​లో తొలి మ్యాచ్​లో హాఫ్ సెంచరీ సాధించిన రాహుల్.. ఇందౌర్​లో కూడా అర్ధ శతకం నమోదు చేశాడు. ఇక పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (31 పరుగులు: 18 బంతులు, 2x4, 2x6) .. వేగంగా ఆడే క్రమంలో జంపాకు వికెట్ సమర్పించుకున్నాడు.

సూర్య తుఫాన్.. ఇషాన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చాడు సూర్యకుమార్ యాదవ్. అతడు వచ్చినప్పటి నుంచే బౌండరీలతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా కామెరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్లో ఏకంగా వరుసగా నాలుగు సిక్స్​లు బాదాడు. దీంతో ఈ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. తర్వాత కూడా తన బీభత్సాన్ని కొనసాగించిన సూర్య.. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్​లో సూర్య 6 ఫోర్లు, 6 సిక్స్​లు బాదాడు.

ఆసీస్​పై వన్డేల్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు..

Ind Vs Aus 2nd ODI : సమయం లేదు అయ్యర్​!.. శ్రేయస్​పై తీవ్ర ఒత్తిడి.. ఆసీస్​తో రెండో వన్డేలో ఏం చేస్తాడో?

ICC Rankings : టీమ్ఇండియా ఫ్యాన్స్​కు ఫుల్​ కిక్.. ఐసీసీ ర్యాంకింగ్స్​లో మనోళ్లదే డామినేషన్!

Last Updated :Sep 24, 2023, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.