ETV Bharat / sports

Ind vs Aus 2nd odi 2023 : టీమ్ఇండియా ఆల్​రౌండ్ షో.. రెండో వన్డేలో ఆసీస్ చిత్తు.. సిరీస్ భారత్ వశం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 10:08 PM IST

Updated : Sep 24, 2023, 11:02 PM IST

ind vs aus 2nd odi 2023
ind vs aus 2nd odi 2023

Ind vs Aus 2nd ODi 2023 : ఇందౌర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా జయకేతనం ఎగురవేసింది. ఏకపక్షంగా సాగిన పోరులో భారత్ 99 పరుగుల తేడాతో నెగ్గింది.

Ind vs Aus 2nd ODi 2023 : ఇందౌర్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. డక్​వర్త్​ లూయిస్ పద్ధతిలో 99 పరుగుల తేడాతో టీమ్ఇండియా నెగ్గింది. 28.2 ఓవర్లలో ఆసీస్​ను 217 పరుగులకు ఆలౌట్ చేసింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (53 పరుగులు), చివర్లో సీన్ అబాట్ (54) రాణించారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు.. ప్రసిద్ధ్ కృష్ణ 2 , షమీ ఒక వికెట్ పడగొట్టారు. ఇక సెంచరీతో అదరగొట్టిన టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​కు 'మ్యాన్ ఆఫ్ ది' మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్​ మిగిలుండగానే వన్డే సిరీస్​ను 2-0 తో కైవసం చేసుకుంది.

400 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిగిన ఆసీస్​కు.. భారత పేసర్ ప్రసిద్ధ్ ఆరంభంలోనే షాకిచ్చాడు. అతడు ఓపెనర్ మ్యాథ్యూ షాట్ (9), స్టీవ్ స్మిత్ (0)ను పెవిలియన్ చేర్చాడు. తర్వాత మ్యాచ్​కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆట కొద్దిసేపు నిలిచిపోయింది. ఇక మ్యాచ్​ను 33 ఓవర్లకు కుదించి ఆసీస్ టార్గెట్​ను 317 పరుగులుగా నిర్దేశించారు. వర్షం తగ్గిన తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో ఆసీస్ టపాటపా వికెట్లు పారేసుకుంది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లలో ఓపెనర్ వార్నర్.. చివర్లో అబాట్ మెరుపులు మెరిపించినా అవి ఓటమి అంతరాయాన్ని తగ్గించగలిగాయి.

భారత్​ ఇన్నింగ్స్​!
ఈ మ్యాచ్​​లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), వన్‌డౌన్‌ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు శతకాలతో చెలరేగారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ (52; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్ (72*; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఇద్దరూ వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధ శతకాలు సాధించారు. ముఖ్యంగా సూర్య.. కామెరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లతో చెలరేగాడు. ఇక మరో బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు. ఆసీస్‌ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2, ఆడమ్ జంపా, సీన్ అబాట్, హేజిల్‌వుడ్ తలో వికెట్ తీశారు.

Shubman Gill 2023 Stats : గిల్ అన్​స్టాపబుల్.. యంగ్​స్టర్ దెబ్బకు రికార్డులు దాసోహం

Ind vs Aus 2nd ODI 2023 : అయ్యర్-గిల్ సెంచరీల మోత.. భారీ స్కోర్ దిశగా భారత్.. ఆసీస్ బౌలర్లను ఆట ఆడేస్తున్నారుగా

Last Updated :Sep 24, 2023, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.