ETV Bharat / sports

'మెగాటోర్నీలో ఈ డెబ్యూ ప్లేయర్ల ఆటకు ఫిదా!'

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 10:48 PM IST

Impressing Debutants World Cup 2023
Impressing Debutants World Cup 2023pressing Debutants World Cup 2023

Impressing Debutants World Cup 2023 : 2023 ప్రపంచకప్​లో వివిధ జట్లనుంచి అనేక మంది ప్లేయర్లు తొలిసారి మెగాటోర్నీలో ఆడారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్.. తనను ఇంప్రెస్ చేసిన డెబ్యూ ప్లేయర్లెవరో సోషల్ మీడియాలో చెప్పాడు.

Impressing Debutants World Cup 2023 : 2023 వరల్డ్​కప్​ లీగ్​ స్టేజ్​లో అనేక అత్యుత్తమ ప్రదర్శనలు నమోదయ్యాయి. పాయింట్ల పట్టకలో అగ్రస్థానంలో ఉన్న టీమ్ఇండియా నుంచి అట్టడుగున ఉన్న నెదర్లాండ్స్ వరకు.. దాదాపు ప్రతీ జట్టులో ఒకరిద్దరు అరంగేట్ర ఆటగాళ్లు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. మెగాటోర్నీలో తనను ఇంప్రెస్ చేసిన ఐదుగురు అరంగేట్ర ఆటగాళ్ల పేర్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించాడు.

రచిన్ రవీంద్ర, శ్రేయస్ అయ్యర్, మార్కొ జాన్సన్, అజ్మతుల్లా ఓమర్జాయ్, దిల్షాన్ మధుషంక పేర్లను ఇర్ఫాన్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. " ప్రపంచకప్​లో ఈ ఐదుగురు అరంగేట్ర ఆటగాళ్లు నిజంగా నన్ను ఆకట్టుకున్నారు. వారి నైపుణ్యాలు కెరీర్​లో వాళ్లను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి" అని ఇర్ఫాన్ అన్నాడు. ఇక ప్రస్తుత వరల్డ్​కప్​లో ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  • 1) Rachin Ravindra
    2) Shreyas Iyer
    3)Marco Jansen
    4) Azmatullah Omarzai
    5) Dilshan MaDushanka

    I have been really impressed by these 5 Debutants of the World Cup. Their skill can take them places going forward. What’s your pick ???? #WorldCup2023

    — Irfan Pathan (@IrfanPathan) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • రచిన్ రవీంద్ర.. మెగాటోర్నీలో అసాధారణ ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర. అతడు 9 మ్యాచ్​ల్లో కలిపి 70.62 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి.
  • శ్రేయస్ అయ్యర్.. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. కెరీర్​లో తొలి వరల్డ్​కప్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి ఛాన్స్​ వచ్చినప్పుడల్లా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నలో అయ్యర్.. 9 మ్యాచ్​ల్లో 421 పరుగులు బాదాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.
  • మార్కొ జాన్సన్.. సౌతాఫ్రికా ఆల్​రౌండర్ మార్కొ జాన్సన్.. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతడు ఇంగ్లాండ్​పై.. 176 స్ట్రైక్​ రేట్​తో 74 పరుగులు బాది బీభత్సం సృష్టించాడు.
  • అజ్మతుల్లా ఓమర్జాయ్.. అఫ్గానిస్థాన్ ఆల్​రౌండర్ అజ్మతుల్లా ఓమర్జాయ్.. బ్యాట్​తో అద్భుతంగా రాణించాడు. అతడు టోర్నీలో 353 పరుగులు చేసి.. బౌలింగ్​లో 7 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.
  • దిల్షాన్ మధుషంక.. శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుషంక.. టోర్నీలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. అతడు 9 మ్యాచ్​ల్లో కలిపి 21 వికెట్లు పడగొట్టాడు.

Cricketers In Movies : హర్భజన్ సింగ్ టు ధోనీ.. ఈ క్రికెటర్స్​ సినిమాల్లో ఫెయిల్​..

ఇర్ఫాన్ పఠాన్-​ అమిత్​ మిశ్రా ట్విట్టర్​ వార్​.. కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.