ETV Bharat / sports

ICC Trophy Winners History : 25ఏళ్లుగా సౌతాఫ్రికా.. 13ఏళ్లుగా టీమ్​ఇండియా.. ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూపులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 7:15 AM IST

ICC Trophy Winners History : అక్టోబరు నెల 5 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఏయే జట్లు ఎన్ని ట్రోఫీలు గెలిచాయి? చివరిసారిగా గెలిచి ఎన్ని ఏళ్లవుతోంది? అనే అంశాలును ఓసారి పరిశీలిద్దాం.

ICC Trophy Winners List
ICC Trophy Winners List

ICC Trophy Winners History : ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఏ క్రికెట్ టీమ్​కు మాత్రం ఉండదు చెప్పండి. దాదాపుగా అన్ని జట్లూ ఈ ఘనతను అందుకున్నాయి. కానీ.. అది జరిగి ఏళ్లు అవుతుంది. ఈ నెలలో ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఏయే క్రికెట్ జట్టు ట్రోఫీని చివరి సారిగా గెలిచింది అనే అంశాల గురించి ఓ లుక్కేద్దాం.

1. సౌత్ ఆఫ్రికా (1998 నుంచి)
సౌత్ ఆఫ్రికా క్రికెట్​ను తొలిసారి 1889లో ఆడింది. అప్పటికీ ఈ క్రీడ ఆడుతున్న మూడో దేశంగా ఉంది. ఈ జట్టు ఎంతో మంది లెజెండ్​లను క్రికెట్​కు అందించింది. ఈ టీమ్​లో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వీళ్ల ఖాతాలో పెద్దగా ఐసీసీ ట్రోఫీలు లేవు. చివరి సారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందీ దేశం. అదే ఆ జట్టు మొదటి, చివరి కప్పు కావడం విశేషం. ఆ సమయంలో జట్టును హాన్సీ క్రాంజీ కెప్టెన్ గా ఉన్నాడు. తర్వాతి కాలంలో ఎన్నో గేమ్స్, టోర్నీలు ఆడింది కానీ.. ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది.

2. ఇండియా (2013 నుంచి)
India 2011 World Cup Win : టీమ్​ఇండియా ఖాతాలో ఇప్పటిదాకా 5 ఐసీసీ ట్రోఫీలున్నాయి. మొదటిసారిగా కపిల్ దేవ్ నాయక్వతంలో 1983 వన్డే ప్రపంచ కప్ గెలుచుకుంది. తర్వాత దాదా సౌరభ్​ గంగూలీ హయాంలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో వరుసగా 2007 టీ 20, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకుని మొత్తం మీద తన ఖాతాలో 5 కప్​లు వేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా టీమ్​ఇండియాకు ఐసీసీ ట్రోఫీ గెలవడం తీరని కోరికగానే మిలిగిపోయింది. 2019 వరల్డ్ కప్​లో సెమీ ఫైనల్ వరకు వచ్చినా.. విఫలమైంది. మరి ఈ సారైనా ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలి.

3. శ్రీలంక (2014 నుంచి)
శ్రీలంక చివరి సారిగా ఐసీసీ ట్రోఫీ గెలిచి 12 ఏళ్లవుతోంది. 2014 ఇండియాపై గెలిచిన టీ20 వరల్డ్ కప్.. లంకకు చివరిది. అది ఆ జట్టుకు మొదటి టీ 20 వరల్డ్ కప్ కాగా.. ఓవరాల్ గా మూడో ఐసీసీ ట్రోఫీ. శ్రీలంక మొదటి సారి అర్జున రణతుంగ కెప్టెన్సీలో 1996 వన్డే ప్రపంచ కప్ గెలుచుకుంది. తర్వాత 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాతో కలిసి కప్పును పంచుకుంది. ఆ సమయంలో వర్షం అడ్డంకి వల్ల ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు.

4. వెస్టిండీస్ (2016 నుంచి)
వెస్టిండీస్ ఇప్పటి వరకు 5 సార్లు ఐసీసీ ట్రోఫీలను ముద్దాడింది. క్రికెట్ చరిత్రలో 1975, 1979 లో నిర్వహించిన మొదటి, రెండు వరల్డ్ కప్పులను వెస్టిండీస్ జట్టు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత 2004 ఛాంపియన్స ట్రోఫీ, 2012లో టీ 20 ప్రపంచ కప్, 2016 లో రెండోసారి పొట్టి కప్పును సొంతం చేసుకుంది. అదే ఆ జట్టుకు చివరి ఐసీసీ కప్పు కావడం విశేషం. కానీ.. బాహుబలి లాంటి దేహాలు కలిగిన ఆటగాళ్లున్న కరీబియన్ టీమ్.. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్పునకు క్వాలిఫై కాకపోవడం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది.

5. పాకిస్థాన్ (2017 నుంచి)
Pakistan ICC Trophies : శ్రీలంక లాగే పాకిస్థాన్ కూడా ఇప్పటి వరకు 3 సార్లు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. మొదటిసారిగా ఆ జట్టు లెజెండరీ ఆల్ రౌండర్ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో 1992లో వన్డే వరల్డ్ కప్ గెలుపొందింది. అంతకు ముందు 1979, 1983, 1978లో సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. తర్వాత 2009లో రెండో సారి జరిగిన టీ 20 వరల్డ్ కప్​ను సొంతం చేసుకుంది. శ్రీలంక పై జరిగిన ఫైనల్లో 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. ఆ తర్వాత 2017లో ఇండియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో విజయం సాధించి మూడో కప్పును తన ఖాతాలో వేసుకుంది. అదే పాకిస్థాన్ కు చివరి ఐసీసీ ట్రోఫీ. ఆ తర్వాత మరే ట్రోఫీ గెలవలేకపోయింది.

6. న్యూజిలాండ్ (2021 నుంచి)
కివీస్ జట్టు ఇప్పటి వరకు 2 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. అవి రెండూ ఇండియాపైనే కావడం విశేషం. మొదటి సారిగా 2000 సంవత్సరంలో ఇండియాతో జరిగిన ఫైనల్లో 264 పరుగులను 6 వికెట్లు కోల్పోయి ఛేందించింది. దీంతో కప్పు వారి సొంతమైంది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్లో భారత్ పైనే విజయం సాధించి రెండో కప్పును ఎగరేసుకుపోయింది. ఈ మధ్య కాలంలో చాలా మ్యాచుల్లో చివరి వరకు బోల్తా కొట్టిందా జట్టు.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు..
ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల విషయానికి వస్తే.. క్రికెట్ కు పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లండ్ జట్టు ఇప్పటిదాకా 3 ఐసీసీ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకుంది. మెగా టోర్నీలు నిర్వహించిన మొదటి కాలం నుంచే పలుమార్లు సెమీ ఫైనల్స్, ఫైనల్స్​కి చేరుకున్నా.. వాటిని విజయాలుగా మలచటంలో విఫలమైంది. ఈ జట్టు మొదటి సారి 2010 లో టీ20 వరల్డ్ కప్, 2019లో వన్డే వరల్డ్ కప్, 2023టీ 20 వరల్డ్ కప్ గెలుపొందింది.

Australia World Cup Wins : క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. కప్పులు గెలవటంలో 1987లో మొదలు పెట్టిన ప్రస్థానాన్ని 2023 వరకు కొనసాగించింది. వన్డే ప్రపంచ కప్ ఒక్కసారి గెలుచుకుంటే చాలనుకునే జట్లుంటే.. ఆస్ట్రేలియా ఏకంగా 5 సార్లు గెలుచుకుంది. అన్ని టోర్నీల ఫైనల్స్​లో కంగారూల దెబ్బకి ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు ఒకసారి బలికాగా.. ఇండియా రెండు సార్లు, న్యూజిలాండ్ మూడు సార్లు ఓటమి రుచి చూశాయి. ఆసీస్ చివరి ఐసీసీ ట్రోఫీ టెస్ట్ ఛాంపియన్ షిప్​ను ఈ ఏడాదే గెలుచుకుంది.

Top 5 Batters In World Cup History : వరల్డ్​ కప్​ టాప్​ - 5 బ్యాటర్లు వీరే.. సచిన్ రికార్డ్​ను ఎవ్వరూ బ్రేక్​ చేయలే!

World Cup History : 1975 టు 2019.. వరల్డ్ కప్​ జర్నీలో ఆ రెండు జట్లే టాప్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.