ETV Bharat / sports

ICC T20 Rankings: కేఎల్ రాహుల్ పైపైకి.. కోహ్లీ దిగువకు

author img

By

Published : Nov 10, 2021, 3:19 PM IST

virat kohli, kl rahul
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను(ICC ranking T20) విడుదల చేసింది. టీమ్​ఇండియా ఓపెనర్​ కేఎల్ రాహుల్(kl rahul news) ఐదో స్థానానికి చేరుకోగా కెప్టెన్​ విరాట్ కోహ్లీ 8 స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను(ICC Ranking T20) బుధవారం విడుదల చేసింది. బ్యాటింగ్​ విభాగంలో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానానికి పడిపోగా.. ఓపెనర్​ కేఎల్ రాహుల్(KL Rahul news) 5వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్​లో భాగంగా చివరి మూడు మ్యాచ్​ల్లో రాహుల్ అర్ధశతకాలతో అదరగొట్టాడు. దీంతో కోహ్లీని వెనక్కినెట్టి ఐదో స్థానానికి చేరుకున్నాడు.

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన మార్​క్రమ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో 25 బంతుల్లో 52 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఉత్తమ టీ20 ఆల్​రౌండర్ల జాబితాలోనూ ఏడో స్థానానికి చేరుకున్నాడు మార్​క్రమ్. మరో దక్షిణాఫ్రికా ఆటగాడు వాన్​ డర్ డస్సెన్ ఉత్తమ ప్రదర్శనతో ఆరు స్థానాలు ఎగబాకి టాప్​ 10లో చోటు సంపాదించుకున్నాడు.

టీ20 ఉత్తమ బ్యాటర్ల జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ రెండో స్థానంలో నిలిచాడు.

బౌలర్లలో..

టీ20 ఉత్తమ బౌలర్ల ర్యాంకింగ్స్​లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, జోష్ హేజిల్​వుడ్. ఆస్ట్రేలియా సెమీస్​ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన జంపా ఐదో స్థానానికి చేరుకోగా.. హేజిల్​వుడ్ ఏకంగా 11మందిని వెనక్కినెట్టి 8వ స్థానానికి చేరాడు. కివీస్​ బౌలర్​ టిమ్​ సౌథీ 9వ స్థానంలో నిలిచాడు.

శ్రీలంక బౌలర్ వానిందు హసరంగ 797 రేటింగ్ పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా.. దక్షిణాఫ్రికా బౌలర్ షంసీ రెండో స్థానంలో నిలిచాడు.

ఆల్​రౌండర్లలో..

ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్ మ్యాక్స్​వెల్, మిచెల్ మార్ష్ ఆల్​రౌండర్ల ర్యాంకింగ్స్​లో సత్తా చాటారు. మ్యాక్స్​వెల్ నాలుగో స్థానానికి చేరుకోగా.. మిచెల్ మార్ష్ 9వ స్థానంలో నిలిచాడు.

అఫ్గానిస్థాన్​ ఆటగాడు మహ్మద్ నబీ మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్​లో మొదటిస్థానంలో ఉన్న హసరంగ.. ఆల్​రౌండర్స్​ జాబితాలోనూ మూడో స్థానం దక్కించుకోవడం విశేషం.

ఇదీ చదవండి:

ఇది చదవండి: కోహ్లీ పాత్రను తక్కువ చేయలేం: నెహ్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.