ETV Bharat / sports

Icc Ceo: ఐసీసీ శాశ్వత సీఈఓగా జెఫ్​ అలార్​డైస్​

author img

By

Published : Nov 21, 2021, 3:41 PM IST

ఎనిమిది నెలలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాత్కాలిక సీఈఓ పదవిలో కొనసాగుతున్న జెఫ్​ అలార్​డైస్​​కు కీలక బాధ్యతలు అప్పగించింది ఐసీసీ. ఆయన్ను ఐసీసీ శాశ్వత సీఈఓగా(Icc new ceo) నియమించినట్లు తెలిపింది.

icc new ceo,  geoff allardice
ఐసీసీ సీఈఓ

అంతర్జాతీయ క్రికెట్ మండలి శాశ్వత సీఈఓగా(Icc ceo 2021) జెఫ్​ అలార్​డైస్(Geoff Allardyce)​ నియమితులయ్యారు. ఎనిమిది నెలలకు పైగా ఐసీసీ తాత్కాలిక సీఈఓగా ఉన్న ఆయనకు శాశ్వతంగా ఆ పదవీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఐసీసీ(Icc news) ఆదివారం ప్రకటించింది. తనను శాశ్వత సీఈఓగా నియమించడం పట్ల జెఫ్ హర్షం వ్యక్తం చేశారు.

"ఐసీసీ సీఈఓగా నియమితులవ్వడం చాలా గౌరవప్రదమైన విషయం. ఈ అరుదైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఐసీసీ ఛైర్మన్​ గ్రెగ్​తో పాటు, ఐసీసీ బోర్డుకు ధన్యావాదాలు. సుదీర్ఘ విజయాన్ని కొనసాగించేందుకు బోర్డు సభ్యులతో సన్నిహితంగా పని చేస్తాను. గత ఎనిమిది నెలలుగా నాకు మద్దతుగా నిలిచిన ఐసీసీ సిబ్బందికి కృతజ్ఞతలు. ప్రతిభావంతులైన ఈ బృందంతో కలిసి క్రికెట్ సేవను కొనసాగించేందుకు కృషి చేస్తాను."

-జెఫ్​ అలార్​డైస్​, ఐసీసీ సీఈఓ

ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్​ క్రికెటర్ అయిన జెఫ్​.. ఎనిమిదేళ్ల పాటు ఐసీసీ క్రికెట్​ జనరల్ మేనేజర్​గా వ్యవహరించారు. అంతకుముందు క్రికెట్ ఆస్ట్రేలియాలోనూ ఆయన ఇదే పదవిలో సేవలందించారు.

కాగా, ఐసీసీ సీఈఓగా శాశ్వతంగా కొనసాగేందుకు జెఫ్​ ఒప్పుకోవడం పట్ల తనకు సంతోషంగా ఉందని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్​ బార్క్లే పేర్కొన్నారు. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించడంలోనూ సమర్థంగా పని చేశారని ప్రశంసించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.