ETV Bharat / sports

'పాంటింగ్‌ స్థానంలో ఇంకెవరైనా ఉంటే తల పగులగొట్టేవాడ్ని'

author img

By

Published : Mar 20, 2022, 5:35 AM IST

Shoaib Akthar Ponting: 1999లో పెర్త్​లో జరిగిన టెస్టు మ్యాచ్​ను గుర్తు చేసుకుంటూ పాకిస్థాన్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు క్రీజులో పాంటింగ్​ కాకుండా ఇంకా ఎవరైనా ఉండి ఉంటే బ్యాటర్​ తల పగులగొట్టేవాడినని అన్నాడు.

రికీ పాంటింగ్​
అక్తర్

Shoaib Akthar Ponting: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్‌ను ఉద్దేశిస్తూ పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 1999లో పెర్త్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.

Perth 1999 Test: ఆసీస్‌ పర్యటనలో పాక్‌ అప్పటికే 0-2తో వెనుకబడి ఉందని, మూడో టెస్ట్‌ మ్యాచ్​లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై బౌన్సర్లతో విరుచుకుపడాలని నిర్ణయించుకున్నానని అక్తర్​ తెలిపాడు. ముందుగా పాంటింగ్‌ను టార్గెట్‌ చేశానని, అయితే ఆ సమయంలో పాంటింగ్ కాకుండా ఏ ఇతర ఆటగాడు క్రీజులో ఉన్నా బంతితో తల పగులగొట్టేవాడినని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు అక్తర్​.

"2005 ఆసీస్‌ పర్యటనలో జస్టిన్ లాంగర్‌తో గొడవ జరిగింది. మాథ్యూ హేడెన్‌తో కూడా కొట్టుకునేంత చిన్నపాటి ఘర్షణ జరిగింది. నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. నా ఆటిట్యూడ్ ఆసీస్​ జట్టు ఆటగాళ్లందరికీ నచ్చేది. ప్రస్తుత ఆసీస్​ ఆటగాళ్లకు అంత దూకుడు లేదు."

- షోయబ్​ అక్తర్​, పాకిస్థాన్​​ మాజీ పేసర్​

అంతర్జాతీయ క్రికెట్​లో అక్తర్​.. 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 444 వికెట్లు తీశాడు​.

ఇదీ చదవండి: రాకెట్​ విసిరిన ప్లేయర్​.. త్రుటిలో తప్పించుకున్న బాల్​బాయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.