ETV Bharat / sports

'మహీ చాలా స్వేచ్ఛనిచ్చాడు.. నన్ను గొప్పగా తీర్చిదిద్దాడు'

author img

By

Published : Jan 25, 2022, 5:50 PM IST

Hardik Pandya Dhoni: టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీపై ప్రశంసలు కురిపించిన ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య.. మహీ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించాడు. క్రికెట్​లో తనను గొప్పగా తీర్చిదిద్దాడని చెప్పాడు. ఐపీఎల్​లో ఆహ్మదాబాద్​ జట్టుకు ఇటీవలే కెప్టెన్​గా ఎంపికైన అతడు ​సారథిగా జట్టును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మరింత శ్రమిస్తానని చెప్పుకొచ్చాడు.

dhoni hardik pandya
ధోనీ హార్దిక్​ పాండ్యా

Hardik Pandya Dhoni: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ.. తన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. వారిలో హార్దిక్​ పాండ్యా కూడా ఒకడు. అయితే గత కొద్ది కాలంగా ఫామ్​లో లేక ఇబ్బంది పడుతున్న అతడు ఇటీవల.. ఈ ఐపీఎల్​ సీజన్​లో కొత్తగా బరిలో దిగబోతున్న అహ్మదాబాద్​ జట్టుకు కెప్టెన్​గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హార్దిక్​ తన కెరీర్​ గురించి మాట్లాడాడు. ఇందులో భాగంగా తన కెరీర్​పై మహీ ఎంతో ప్రభావం చూపాడని అన్నాడు. అతడి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించాడు.

"నేను చాలా మంది నుంచి ముఖ్యంగా ధోనీ భాయ్​ నుంచి చాలా నేర్చుకున్నాను. టీమ్​ఇండియాలోకి అడుగుపెట్టేటప్పుడు నాకు ఏమీ అంతగా తెలీదు. నేను ఓ రా మెటేరియల్​. మహీ నన్ను తీర్చిదిద్దాడు. నా తప్పులను నేను స్వయంగా తెలుసుకుని సరిదిద్దుకునేలా నన్ను మలిచాడు. చాలా స్పేచ్ఛనిచ్చాడు. నేను జట్టులోకి వెళ్లినప్పుడు మహీ భాయ్​ అంతా చూసుకుంటాడులే అనుకున్నా. బంతి అక్కడ విసురు, ఇక్కడ విసురు ఇలా అన్ని విషయాలు నేర్పిస్తాడనుకున్నా. కానీ ఆ తర్వాత ఎందుకతను ఏ విషయాలు చెప్పట్లేదు అనిపించింది. అనంతరం నాకు నేనే నేర్చుకునేలా నన్ను తయారుచేశాడని తెలిసింది. దీని వల్లే నేనింకా క్రికెట్​లో కొనసాగగలుగుతున్నాను."

తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లో ధోనీ తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు హార్దిక్. "నా తొలి మ్యాచ్​లో వేసిన తొలి ఓవర్​లో 19 పరుగులు ఇచ్చాను. దీంతో నా కెరీర్​ అయిపోయినట్టే అనుకున్నా. ధోనీ వేరే ప్లేయర్​ను రెండో ఓవర్​ వేయమంటాడు అనుకున్నా. కానీ నన్నే బౌలింగ్​ చేయమన్నాడు. అప్పుడు నేను చేసిన తప్పిదాన్ని సరిచేసుకుని మంచిగా ఆడా. మహీ మనతో లేనట్టే ఉంటాడు, కానీ మనతోనే ఉంటూ మన తప్పుల నుంచి మనమే నేర్చుకునేలా చేస్తాడు." అని హార్దిక్​ పేర్కొన్నాడు.

కాగా, టీమ్​ఇండియా స్టార్​ ఆల్​రౌండర్​గా హార్దిక్​ ఎంతో క్రేజ్​ సంపాదించుకున్నాడు. అయితే అతడు కొంతకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్​ 2021, టీ ప్రపంచకప్​ 2021లో పేలవ ప్రదర్శన చేసి జట్టుకు దూరమయ్యాడు.

దీని గురించి మాట్లాడిన అతడు.. "నేను ఆల్​రౌండర్​గానే ఆడాలనుకుంటున్నాను. క్లిష్ట పరిస్థితులు ఎదురుకావచ్చు. కానీ ఆల్​రౌండర్​గానే ఆడేందుకు అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నా. నా ప్రణాళిక అదే. ప్రస్తుతం నేను ధృఢంగానే ఉన్నాను. అయితే ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే ఒక జట్టు ఎలా ఉంటే మంచి ఫలితాలు అందుకుంటుందో నా నాయకత్వం అలాంటి సంస్కృతిని పెంపొందించగలగాలి. జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాలి" అని వెల్లడించాడు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!


ధోనీ లేక వాళ్లు విఫలమవుతున్నారు: దినేశ్​ కార్తిక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.