ETV Bharat / sports

T20 World Cup: 'టీ20 ప్రపంచకప్​ జట్టులో చాహల్​ ఆడొచ్చు!'

author img

By

Published : Oct 6, 2021, 8:54 PM IST

టీమ్​ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్​ను ఛాంపియన్ బౌలర్​ అంటూ కొనియాడాడు వెటరన్​ క్రికెటర్ హర్భజన్ సింగ్. చాహల్​ను టీ20 ప్రపంచకప్​ (T20 World Cup) జట్టులో చూడాలనుకుంటున్నట్లు హర్భజన్​ చెప్పాడు.

T20 World Cup
టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​ జట్టులో(India t20 world cup 2021 squad) టీమ్ఇండియా స్టార్​ స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​కు స్థానం దక్కుతుందని వెటరన్​ క్రికెటర్​ హర్భజన్​ సింగ్​ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 17 నుంచి యూఏఈ, ఒమన్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌(T20 World Cup) కోసం ఇప్పటికే అనేక దేశాలు తమ జట్లను ప్రకటించాయి. బీసీసీఐ కూడా ఇటీవలే టీమ్‌ఇండియా జట్టును ప్రకటించింది. చాహల్‌కు మాత్రం ఈ జట్టులో స్థానం కల్పించలేదు. అయితే, అక్టోబర్‌ 10 వరకు తుదిజట్లలో మార్పులు చేసుకోవచ్చని ఐసీసీ పేర్కొంది. దీంతో భారత జట్టులో ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తారా? అనే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చాహల్‌(Yuzvendra Chahal News) జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh Latest News) ట్వీట్‌ చేశాడు.

"నువ్వు(చాహల్) ఎప్పటిలాగే అత్యుత్తమంగా ఉన్నావు. అదే ఫామ్​ను కొనసాగించు. సరైన వేగంతో బౌలింగ్ చేస్తున్నానని నిర్ధారించుకో. చాలా నెమ్మదిగా బౌలింగ్‌ చేయకు. టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియాలో నిన్ను చూడాలని ఆశిస్తున్నా. ఛాంపియన్ బౌలర్" అని హర్భజన్‌ ట్వీట్‌ చేశాడు.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore Squad 2021) యుజ్వేంద్ర చాహల్ ప్రాతినిధఅయం వహిస్తున్నాడు. "ఆర్‌సీబీ విజయాల కోసం నేను వంద శాతం కృషి చేస్తా" అని ఇటీవలే చాహల్​ ట్వీట్‌ చేయగా.. దీనికి సమాధానంగా హర్భజన్‌ ఈ ట్వీట్‌ చేశాడు.

ఇదీ చూడండి: ఐసీసీ ప్లేయర్​ 'ఆఫ్​ ది మంత్​' రేసులో వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.