ETV Bharat / sports

Gambhir IPL: ఐపీఎల్​లోకి గంభీర్​ రీఎంట్రీ.. ఈసారి మెంటార్​గా

author img

By

Published : Dec 18, 2021, 3:02 PM IST

Updated : Dec 18, 2021, 3:38 PM IST

gambhir
గంభీర్

Gautam Gambhir mentor: టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ గౌతమ్ గంభీర్ ఐపీఎల్​లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్​ రాబోయే సీజన్​లో లఖ్​నవూ జట్టుకు మెంటార్​గా వ్యవహరించనున్నాడు. ​

Gautam Gambhir mentor: భారత జట్టు మాజీ ఓపెనర్, కోల్​కతా నైట్ రైడర్స్​ మాజీ సారథి గౌతమ్ గంభీర్ ఐపీఎల్​లోకి రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్​​లోని రెండు కొత్త జట్లలో ఒకటైన లఖ్​నవూ ఫ్రాంఛైజీకి గంభీర్​ మెంటార్​గా ఎంపికయ్యాడు.

తొలుత తమ ఫ్రాంఛైజీకి ఆండీ ఫ్లవర్​ను​ హెడ్​ కోచ్​గా ఎంపిక చేసిన లఖ్​నవూ జట్టు.. గంభీర్​ను మెంటార్​గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన గంభీర్.. ఆర్​పీఎస్​జీ గ్రూప్​నకు, డాక్టర్​ గోయెంకాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.

గోయెంకా సారథ్యంలోని ఆర్‌పీ-ఎస్‌జీ గ్రూప్‌ రూ.7090 కోట్లతో లఖ్‌నవూ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది.

రెండు సార్లు కప్పు..

గంభీర్​ సారథ్యంలో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు రెండుసార్లు ఐపీఎల్​ కప్​ కొట్టింది. 2012, 2014లో కేకేఆర్​ విజేతగా నిలిచింది. గంభీర్.. టీమ్​ఇండియా తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు.

అయితే.. గంభీర్​ ప్రస్తుతం భాజపా ఎంపీ అయినందును అతడిపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలేలా కనిపిస్తోంది. మరి దీన్ని అతడు ఎలా ఎదుర్కొంటానేది చూడాలి.

మరోవైపు పంజాబ్​ కింగ్స్​ జట్టును వీడిన టీమ్​ఇండియా ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ను కెప్టెన్​గా ఎంపిక చేసేందుకు లఖ్​నవూ జట్టు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

'వారంతా కోహ్లీ ఆటలో సగం కూడా ఆడలేదు'

Last Updated :Dec 18, 2021, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.