ETV Bharat / sports

దాదా మార్క్​ దూకుడు.. ద్రవిడ్, లక్ష్మణ్​తో మాస్టర్​ ప్లాన్

author img

By

Published : Nov 15, 2021, 5:30 AM IST

టీమ్​ఇండియా కొత్త శకంలోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు జట్టును ముందుండి అద్భుత విజయాలనందించిన గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇప్పుడు వెన్నుండి నడిపించనున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, ప్రధాన కోచ్​గా ద్రవిడ్, ఎన్​సీఏ అధ్యక్షుడిగా లక్ష్మణ్​.. భారత జట్టును ఎవ్వరూ చేరలేని తీరాలకు నడిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ద్రవిడ్, లక్ష్మణ్​ పదవులు చేపట్టడం వెనుక ప్రధాన కృషి గంగూలీదే!

ganguly dravid
గంగూలీ

టీమ్​ఇండియా సారథిగా తనదైన ముద్ర వేసిన గంగూలీ (Ganguly News).. బీసీసీఐ అధ్యక్షుడిగానూ తన మార్క్‌ చూపిస్తున్నాడు. తాను సారథిగా ఉన్నప్పుడు యువ క్రికెటర్లకు పెద్దపీట వేసి భారత జట్టు భవిష్యత్తుకు బాటలు వేసిన దాదా.. ఇప్పుడు టీమ్​ఇండియాను మరోసారి విశ్వ విజేతను చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాడు. పదవిపై అంతగా ఆసక్తి లేని.. మాజీ దిగ్గజ క్రికెటర్లను కీలక బాధ్యతలు చేపట్టేలా ఒప్పించాడు. రానున్న మూడేళ్లల్లో జరిగే ఐసీసీ టోర్నీలకు పటిష్ఠ జట్టును తయారు చేసే వ్యూహాల్లో ముగినిపోయాడు.

ganguly dravid
సచిన్​తో ద్రవిడ్, దాదా, లక్ష్మణ్

రాబోయే రెండు, మూడేళ్లు టీమ్​ఇండియాకు చాలా కీలకం. ఈ సమయంలో.. మరో టీ20 ప్రపంచకప్‌తో పాటు, టెస్టు ఛాంపియన్‌షిప్‌, వన్డే ప్రపంచకప్‌ జరగనున్నాయి. ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతున్న భారత జట్టును.. ఈ టోర్నీల నాటికి మరింత పటిష్టంగా మార్చాలని బీసీసీఐ భావిస్తోంది. అందులో భాగంగానే మాజీ దిగ్గజ క్రికెటర్లకు.. టీమ్​ఇండియాలో కీలక బాధ్యతలు అప్పగిస్తోంది.

ద్రవిడ్​ అంగీకరించేలా..

ganguly dravid
టీమ్​ఇండియా హెడ్ కోచ్ ద్రవిడ్

టీమ్​ఇండియా సారథిగా తన మార్క్‌ను చాటుకున్న గంగూలీ (Sourav Ganguly News).. బీసీసీఐ అధ్యక్షుడిగానూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవి చేపట్టేందుకు అంగీకరించని రాహుల్‌ ద్రవిడ్‌ను.. ఆ బాధ్యతలు స్వీకరించేలా గంగూలీ (Ganguly Dravid) ఒప్పించాడు. అండర్‌ 19, ఇండియా ఏ జట్ల కోచ్‌గా సత్ఫలితాలు రాబట్టిన ద్రవిడ్‌.. ఎంతోమంది యువ క్రీడాకారులను జాతీయ జట్టుకు అందించాడు. టీమ్​ఇండియా హెడ్‌ కోచ్‌ పదవిని ద్రవిడ్‌ (Dravid Coach News) చేపట్టడం వల్ల భారత జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టమై ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటుతుందని మాజీలు అంచనా వేస్తున్నారు.

ఎన్​సీఏ బాధ్యతలు లక్ష్మణ్​కు..

ganguly dravid
లక్ష్మణ్​తో దాదా

రాహుల్‌ ద్రవిడ్‌ను టీమ్​ఇండియా హెడ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పించిన గంగూలీ, మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మెంటార్‌ వీవీఎస్ లక్ష్మణ్‌ను (VVS Laxman Latest News).. త్వరలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్​సీఏ) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఈ విషయాన్ని ఆదివారం ధ్రువీకరించాడు.

ganguly dravid
లక్ష్మణ్, ద్రవిడ్

పట్టుబట్టి ఒప్పించింది దాదానే!

ద్రవిడ్​ నిష్క్రమణతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఆ బాధ్యతలు (NCA Director) చేపట్టేందుకు తొలుత లక్ష్మణ్‌ నిరాకరించాడని వార్తలు వచ్చాయి. అధ్యక్షుడు గంగూలీ, సెక్రెటరీ జైషా లక్ష్మణ్‌తో చర్చించి ఒప్పించారని తెలిసింది.

ganguly dravid
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

మరోవైపు ఇటీవల ద్రవిడ్‌ విషయంలోనూ ఇలాగే జరిగింది. తొలుత రాహుల్‌ (Rahul Dravid Coach News) సైతం టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా పనిచేయడానికి ఒప్పుకోలేదనే వార్తలు వినిపించాయి. చివరికి గంగూలీ, షా పట్టుబట్టి ఒప్పించారని తెలిసింది. కాగా, ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించిన దిగ్గజాలు ఇప్పుడు భారత జట్టుకు వెన్నెముకలా నిలిచారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో అయినా టీమ్‌ఇండియా ఐసీసీ ట్రోఫీలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి: T20 World Cup: గత టీ20 వరల్డ్​కప్​ విన్నర్స్ వీళ్లే.. ఈసారి ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.