ETV Bharat / sports

Parthiv Patel News: మాజీ క్రికెటర్​ పార్థివ్​ పటేల్​ ఇంట విషాదం

author img

By

Published : Sep 26, 2021, 2:14 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌(Parthiv Patel News) నివాసంలో విషాదం నెలకొంది. అతని తండ్రి అజయ్‌భాయ్‌ బిపిన్‌చంద్ర పటేల్‌(Parthiv Patel Father) ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పార్థివ్‌ పటేల్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

Former Indian cricketer Parthiv Patel's father passes away
Parthiv Patel News: మాజీ క్రికెటర్​ పార్థివ్​ పటేల్​ ఇంట విషాదం

టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ పార్థివ్​ పటేల్​కు(Parthiv Patel News) పితృవియోగం కలిగింది. పార్థివ్​ తండ్రి అజయ్​భాయ్​ బిపిన్​చంద్ర​ పటేల్​ మరణించారు. అనారోగ్యం కారణంగా తన తండ్రి(Parthiv Patel Father) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు పార్థివ్​ పటేల్​ ట్వీట్​ చేశాడు. దీనిపై స్పందించిన పలువురు క్రికెటర్లు కామెంట్లు చేసి పార్థివ్​ పటేల్​కు సంఘీభావం తెలిపారు.

  • It is with the deepest grief and sadness, we inform the passing away of my father Mr. Ajaybhai Bipinchandra patel. He left for his heavenly abode on 26th September 2021.We request you to keep him in your thoughts and prayers. May his soul rest in peace🙏 ॐ नम: शिवाय🙏🙏 pic.twitter.com/tAsivVBJIt

    — parthiv patel (@parthiv9) September 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా తండ్రి అజయ్​భాయ్​ బిపిన్​చంద్ర పటేల్​ మరణించారని చెప్పేందుకు చింతిస్తున్నాను. సెప్టెంబరు 26(ఆదివారం) ఆయన తనువు చాలించారు. నా తండ్రి ఆత్మశాంతి చేకూరేలా ప్రార్థన చేయాలని మిమ్మల్ని(ఫ్యాన్స్​) ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక".

- పార్థివ్​ పటేల్​, టీమ్ఇండియా మాజీ క్రికెటర్​

పార్థివ్​ పటేల్​ తండ్రి అజయ్​ పటేల్​ గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. ఆయన్ని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించినా.. లాభం లేకపోయిందని పార్థివ్​ సన్నిహితులు చెబుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న తండ్రి బాగోగులతో పాటు ఐపీఎల్​లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు పార్థివ్​ పటేల్​.

గతేడాది డిసెంబరులో పార్థివ్​ పటేల్​ తన అంతర్జాతీయ క్రికెట్​ కెరీర్​కు వీడ్కోలు(Parthiv Patel Retirement) పలికాడు. దాదాపుగా 17 ఏళ్ల పాటు సాగిన క్రికెట్​ కెరీర్​లో ఎన్నో ఘనతలను సాధించాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్​తో(Parthiv Patel Cricket Career) అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. దాదాపుగా 65 మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించి.. 1706 పరుగులు నమోదు చేశాడు.

ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు తరఫున ఎక్కువ సీజన్లలో(Parthiv Patel IPL Contract) ప్రాతినిధ్యం వహించాడు. అంతకుముందు ఈ టోర్నీలో ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​, డెక్కన్​ ఛార్జెస్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​, కోచి టస్కర్స్​ కేరళ జట్లలో ఆడాడు. ​ప్రస్తుతం ఐపీఎల్​(Parthiv Patel IPL 2021) వ్యాఖ్యాతల ప్యానల్​లో భాగమయ్యాడు.

ఇదీ చూడండి.. IPL 2021: బెంగళూరు-ముంబయి.. గెలుపుబాట పట్టేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.