ETV Bharat / sports

ఆ కేసులో బీసీసీఐ బాస్​ బిన్నీకి క్లీన్ చిట్​

author img

By

Published : Jan 13, 2023, 5:35 PM IST

BCCI president Roger Binny Conflict of Interest
ఆ కేసులో బీసీసీఐ అధ్యక్షుడు బిన్నీకి క్లీన్ చిట్​

తనపై నమోదైన కాన్​ఫ్లిక్ట్​ ఆఫ్ ఇంట్రెస్ట్​(పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) కేసులో నుంచి బయటపట్టాడు బీసీసీఐ బాస్​ రోజర్​ బిన్నీ. అతడిపై నమోదైన కేసును కొట్టిపారేస్తూ ఓ నివేదికను విడుదల చేశారు బోర్డు థిక్స్​ ఆఫీసర్ వినీత్ శరన్​.

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్​ బిన్నీకి.. తనపై నమోదైన కాన్​ఫ్లిక్ట్​ ఆఫ్ ఇంట్రెస్ట్​(పరస్పర విరుద్ధ ప్రయోజనాల) కేసులో క్లీన్ చిట్​ లభించింది. ఆ కేసును కొట్టి పారేశారు బీసీసీఐ ఎథిక్స్​ ఆఫీసర్, రిటైర్డ్​ జస్టిస్​​ వినీత్ శరన్​. బిన్నీపై సంజీవ్ గుప్తా చేసిన ఆరోపణలలో ఎలాంటి యోగ్యతమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు 11 పేజీల 20 పాయింట్ల నివేదికను విడుదల చేశారు. గుప్తా ఫిర్యాదును తిరస్కరించినట్లు దాని సారాశం. అలానే అందులో.. ఫిర్యాదు చేసిన పత్రాలను సంబంధం లేని థర్డ్​ పార్టీలతో పంచుకోవద్దని సంజీవ్ గుప్తాకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.

కాగా, మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా. లోధా కమిటీ సంస్కరణల నేపథ్యంలో బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆటగాళ్లు, అధికార ప్రతినిధులు, ఫ్రాంఛైజీల యజమానులపై ఫిర్యాదులు చేస్తుంటాడు. అలా ఇప్పటికే మాజీ కెప్టెన్లు ధోని, కోహ్లి, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోశాధికారి అరుణ్‌, ఉపాధ్యక్షుడు రాజీవ్‌పై ఫిర్యాదులు చేశాడు. అతని ఫిర్యాదుల ప్రకారం మాజీ ఆటగాళ్లు సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడ్డట్లు గతంలో తేలింది.

బిన్నీపై ఫిర్యాదు ఏంటంటే?.. 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రోజర్ బిన్నీ అక్టోబర్ 18న బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ముంబయిలో నిర్వహించిన బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో గంగూలీ స్థానంలో అధ్యక్షుడిగా బిన్నీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే 67 ఏళ్ల బిన్నీ ఎన్నికైన నెల రోజులకే.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడంటూ అతడిపై సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు. స్వదేశంలో భారత్‌ ఆడే క్రికెట్‌ ప్రసార హక్కులను కలిగి ఉన్న స్టార్‌స్పోర్ట్స్‌లో బిన్నీ కోడలు మయంతి లాంగర్ పని చేస్తోందని ఫిర్యాదులో గుప్తా పేర్కొన్నాడు. అయితే దీనిపై బోర్డు ఎథిక్స్‌ అధికారి వినీత్‌ శరణ్‌ నోటీసులు కూడా జారీ చేశారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. దానిపై బిన్నీ ఇటీవలే వివరణ కూడా ఇచ్చారు.

ఇదీ చూడండి: IND VS SL: ఇషాన్​ కిషన్​తో కలిసి కోహ్లీ నాటు డ్యాన్స్​.. చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.