ETV Bharat / sports

'ఇంగ్లాండ్​లో పరిస్థితులు కివీస్​కే అనుకూలం'

author img

By

Published : May 26, 2021, 10:07 PM IST

ఇంగ్లాండ్​లో వాతావరణ పరిస్థితులు భారత్​తో పోల్చితే న్యూజిలాండ్​కే అనుకూలంగా ఉన్నాయని ఆసీస్ బౌలర్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్​లో ఇరుజట్లలో ఎవరు గెలుస్తారంటే మాత్రం కచ్చితంగా చెప్పలేమని తెలిపాడు.

pat cummins, australia bowler
కమిన్స్, ఆస్ట్రేలియా బౌలర్

యూకే వేదికగా జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​పై ఆసీస్ బౌలర్​ కమిన్స్ స్పందించాడు. ఇంగ్లాండ్​లోని వాతావరణ పరిస్థితులు భారత్​తో పోల్చితే కివీస్​కే అనుకూలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. కానీ, ఈ మ్యాచ్​లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

"డబ్ల్యూటీసీ ఫైనల్​​ గొప్ప మ్యాచ్​ అవుతుంది. ఇంగ్లాండ్​లో అధికంగా వర్షాలు కురుస్తున్నాయని నేను వార్తల్లో చూశాను. నాకు తెలిసి ఈ తరహా వాతావరణ పరిస్థితులు న్యూజిలాండ్​కు అనుకూలంగా ఉంటాయి. గత రెండు నెలలుగా ఇరు జట్లు టెస్టు మ్యాచ్​లు ఆడలేదు. కాబట్టి ఏదైనా జరగొచ్చు. నేను ఎవరికి మద్దతివ్వను. ఒకవేళ నేనేమైనా చెప్పాలనుకుంటే మాత్రం.. వాతావరణ పరిస్థితులు కివీస్​కే అనుకూలంగా ఉన్నాయి."

-ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా బౌలర్.

డబ్ల్యూటీసీ కాన్సెప్ట్​ను తాను ప్రేమిస్తున్నానని కమిన్స్ తెలిపాడు. ఈ ఫైనల్ మ్యాచ్​కు దూరం కావడం పట్ల బాధగా ఉందన్నాడు. కొవిడ్ కారణంగా ఈ సిరీస్​ను కోల్పోయామని ఆవేదనగా చెప్పాడు.

ఇదీ చదవండి: 'ధోనీ వీడ్కోలు​ తర్వాతే నాకు వరుస అవకాశాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.