ETV Bharat / sports

KL రాహుల్​కు జరిమానా- మ్యాచ్​ ఫీజులో కోత

author img

By

Published : Sep 5, 2021, 3:14 PM IST

టీమ్​ఇండియా ఓపెనర్​ కేఎల్ రాహుల్​పై(KL Rahul news) జరిమానా విధించింది ఐసీసీ. అంపైర్​ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మ్యాచ్​ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Kl rahul
కేఎల్ రాహుల్

టీమ్​ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్​కు(KL Rahul news) జరిమానా విధించారు. డీఆర్​ఎస్​ తర్వాత అంపైర్​ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకుగానూ అతడి మ్యాచ్​ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఐసీసీ ఎలైట్ ప్యానల్​ ఆఫ్​ మ్యాచ్​ రిఫరీ సభ్యుడు క్రిస్​ బోర్డ్.

టీమ్​ఇండియా, ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో(Ind vs Eng 4th test).. భారత్​ రెండో ఇన్నింగ్స్​ 34వ ఓవర్లో రాహుల్​ ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినట్లు బోర్డు స్పష్టం చేసింది. రాహుల్.. లెవల్​ 1 స్థాయి ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అతనికి ఓ డీమెరిట్​ పాయింట్​ను జత చేస్తున్నట్లు తెలిపింది. అయితే క్రిస్​ బోర్డ్ లేవనెత్తిన ఉల్లంఘన అంశాన్ని రాహుల్​ అంగీకరించాడు.

లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు పాల్పడిన ఆటగాడిపై 50 శాతం ఫీజు కోత విధించొచ్చు. ఒకటి లేదా రెండు డీమెరిట్​ పాయంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. 24 నెలల వ్యవధిలో ఓ ఆటగాడిపై నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ డీమెరిట్​ పాయింట్స్ ఉంటే అవి సస్పెన్షన్​ పాయింట్లుగా మారుతాయి. ఆటగాడి బ్యాన్​ చేస్తారు.

ఇదీ చదవండి:

రోహిత్​ రికార్డు.. ఇంగ్లాండ్ గడ్డ​పై భారత్​ నుంచి ఒక్కడే

Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్​కు పెద్ద ఛాలెంజ్​ అదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.