ETV Bharat / sports

ప్రక్కా ప్రణాళికతో రూట్​ను ఔట్​ చేశా: సిరాజ్​

author img

By

Published : Mar 4, 2021, 7:46 PM IST

అహ్మదాబాద్​ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టు తొలిరోజు ఆటలో తన బౌలింగ్​ ప్రదర్శనతో సంతృప్తి చెందినట్లు టీమ్ఇండియా పేసర్​ మహ్మద్​ సిరాజ్ అన్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్​తో ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​ సహా బెయిర్​ స్టో వికెట్లు పడగొట్టినట్లు తెలిపాడు. ఈ వికెట్లు సాధించడంలో ముందస్తు వ్యూహాలు ఫలించాయని స్పష్టం చేశాడు.

Enjoyed Root's dismissal as I set him up with away going deliveries: Siraj
ప్రక్కా ప్రణాళికతో రూట్​ను ఔట్​ చేశా: సిరాజ్​

ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టెస్టు తొలిరోజున తన బౌలింగ్​ ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చిందని టీమ్ఇండియా పేసర్​ మహ్మద్​ సిరాజ్​ అన్నాడు. ఇంగ్లీష్​ కెప్టెన్​ జో రూట్​, బ్యాట్స్​మన్​ బెయిర్​ స్టోను ముందస్తు ప్రణాళికల ద్వారా ఔట్​ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపాడు.

మ్యాచ్​ అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సిరాజ్

"ఓవర్​ ప్రారంభానికి ముందు నా బౌలింగ్​లో రూట్​ను ఔట్​ చేయాలని అనుకున్నా. ఆ విధంగా నా వ్యూహాన్ని అమలు పరిచి అనుకున్నది సాధించా. అది నాకొక గొప్ప అనుభూతినిచ్చింది. అదే విధంగా కొన్ని పాత ఫుటేజీల ద్వారా బెయిర్​ స్టో బ్యాటింగ్​ బలహీనతను తెలుసుకున్నా. ఇన్​-స్వింగ్​ బంతులకు అతడు ఔట్​ అవ్వడం గమనించా. వరుసగా అవే బంతులను విసరడం వల్ల చివరికి అతడి వికెట్​ సాధించగలిగా".

- మహ్మద్​ సిరాజ్​, టీమ్ఇండియా పేసర్​

కోహ్లీకి చెప్పాను..

ఇంగ్లాండ్​ బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​తో జరిగిన వాగ్వివాదంపై సిరాజ్​ స్పందించాడు. ఈ సంఘటనలో కెప్టెన్​ విరాట్​ కోహ్లీ చాలా చక్కగా వ్యవహరించాడని తెలిపాడు. "అతడు (బెన్​ స్టోక్స్​) నాపై ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయాన్ని విరాట్​ కోహ్లీ భాయ్​కి చెప్పాను. అతడికి తగిన రీతిలో కోహ్లీ సమాధానం చెప్పాడు" అని సిరాజ్​ అన్నాడు.

స్పిన్నర్లదే పైచేయి..

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​ జట్టు బ్యాట్స్​మన్​ మరోసారి తేలిపోయారు. నాలుగో టెస్టులో టీమ్​ఇండియా స్పిన్‌ ద్వయం అక్షర్‌ పటేల్‌ (4/68), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/47) మాయాజాలానికి సిరాజ్‌ (2/45) పేస్‌ తోడవ్వడం వల్ల ఇంగ్లీష్​ జట్టు విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన భారత్​.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్​ నష్టానికి 24 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (8), చెతేశ్వర్‌ పుజారా (15) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్‌ మూడో బంతికే శుభ్‌మన్‌ గిల్‌ (0) వికెట్‌ చేజార్చుకున్న భారత్‌ చివరి (12 ఓవర్లు) వరకు పట్టుదలగా ఆడింది. కోహ్లీసేన 181 పరుగుల లోటుతో ఉంది.

ఇదీ చూడండి: స్పిన్నర్లదే రాజ్యం.. ఆడితేనే పరుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.