ETV Bharat / sports

'36 చేదు జ్ఞాపకం మాకుంటే ఇంగ్లాండ్‌కు 58'

author img

By

Published : Feb 24, 2021, 8:11 AM IST

england were on 58 and india on 36 runs in last day night test
'36 చేదు జ్ఞాపకం మాకుంటే ఇంగ్లాండ్‌కు 58'

మొతేరా వేదికగా నేటి (బుధవారం) నుంచి భారత్‌×ఇంగ్లాండ్‌ మధ్య డే/నైట్ టెస్టు జరగనున్న సందర్భంగా కెప్టెన్​ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ లక్ష్యంగా మిగిలిన రెండు టెస్టుల్లోనూ గెలుపొందేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో 36 పరుగులకే కుప్పకూలిపోవడం ఓ చేదు జ్ఞాపకమని కోహ్లీ వెల్లడించాడు.

మొతేరా వేదికగా బుధవారం నుంచి ఇంగ్లాండ్​తో జరగనున్న డే/నైట్​ మ్యాచ్​కు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. ఈ సిరీస్​లో గెలుపొంది.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​కు చేరుకోవాలని కోహ్లీసేన కృషి చేస్తోంది. అయితే, దాని కోసం మిగిలిన రెండు మ్యాచ్​ల్లోనూ గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు విరాట్​ మీడియాకు తెలిపాడు.

"ఒక మ్యాచ్‌‌ డ్రాగా ముగించి, మరొకటి విజయం సాధించాలని మేం భావించట్లేదు. రెండు మ్యాచ్‌లూ గెలవాలని ప్రయత్నిస్తున్నాం. ఫలితం గురించి తర్వాత ఆలోచిస్తాం."

- విరాట్​ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్​

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌ను భారత్‌ 2-1 లేదా 3-1తో గెలిస్తే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ చెరో విజయం సాధించాయి.

అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన గత డే/నైట్ టెస్టులో టీమిండియా 36 పరుగులకు కుప్పకూలింది. ఆ ఫలితం ఏమైనా ప్రభావితం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు.. "45 నిమిషాల పేలవమైన ఆటతో అలా జరిగింది. అలాంటి చేదు జ్ఞాపకమే ఇంగ్లాండ్‌కు కూడా ఉంది" అని అన్నాడు. 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ 58 పరుగులకు ఆలౌటైంది.

ఇదీ చూడండి: 'అశ్విన్​ వరల్డ్​ క్లాస్​ ప్లేయర్​.. పంత్​ నైపుణ్య ఆటగాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.