ETV Bharat / sports

ఇంగ్లాండ్ బోర్డు జాతీయ సెలెక్టర్ పదవి రద్దు

author img

By

Published : Apr 21, 2021, 10:31 AM IST

ఇంగ్లాండ్ జాతీయ సెలెక్టర్​ పదవి ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇకపై జట్టు ఎంపికలో తుది నిర్ణయం కోచ్ క్రిస్ సిల్వర్​వుడ్​దే. ఎంపిక ప్రక్రియలో అతడికి మోర్గాన్, రూట్ సహకరించనున్నారు.

chris silverwood, england and wales cricket board
క్రిస్ సిల్వర్వు​డ్​, ఇంగ్లాండ్ అండ్​ వేల్స్​ క్రికెట్ బోర్డు

జాతీయ సెలెక్టర్​ పదవీకి ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు ముగింపు పలికింది. ఇకపై జట్టు ఎంపిక ప్రక్రియను ప్రధాన కోచ్​ సిల్వర్​వుడ్​ పర్యవేక్షించనున్నారు. తుది జట్టు ఎంపిక ప్రక్రియలో కెప్టెన్లు జో రూట్​, ఇయాన్​ మోర్గాన్​.. సిల్వర్​వుడ్​కు సహకరించనున్నారు.

ఇప్పటివరకు జట్టు ఎంపికలో జాతీయ సెలెక్టర్​ ఎడ్​ స్మిత్​తో పాటు కోచ్​ సిల్వర్​వుడ్​, జేమ్స్​ టేలర్​, మరో ఇద్దరు ఉండేవారు. ఈ నిర్ణయంతో స్మిత్​ ఈ నెలాఖరుకు​ తన పదవి నుంచి వైదొలగనున్నారు.

ఇదీ చదవండి: ఐపీఎల్: బబుల్​ నుంచి వెళ్లిపోయిన రాజస్థాన్ క్రికెటర్!

ప్రస్తుత కోచ్​ సిల్వర్​వుడ్​కు ఎక్కువ జవాబుదారీతనం ఇచ్చేందుకే ఈ సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చారు ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్​ మేనేజింగ్ డైరెక్టర్​ ఆష్లే గైల్స్​.

"120 ఏళ్లుగా ఇంగ్లాండ్ క్రికెట్​లో ఈ వ్యవస్థ ఉంది.​ పురుషుల క్రికెట్​కు మూడేళ్లుగా ఎడ్​ స్మిత్​ ఎనలేని సేవలందించారు. అందుకు అతనికి కృతజ్ఞతలు. ఇకపై జట్టు ఎంపికలో అంతిమ నిర్ణయం కోచ్​ సిల్వర్​వుడ్​దే"

-ఆష్లే గైల్స్, ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్​ మేనేజింగ్ డైరెక్టర్.

2018లో ఇంగ్లాండ్ సెలెక్టర్​గా ఎంపికైన ఎడ్​ స్మిత్​.. 2019 ప్రపంచకప్​ గెలిచిన టీమ్​ను ఎంపిక చేశాడు. ఆష్లే టీమ్​ కోసం ఎంత కష్టపడతాడో తెలుసని తెలిపాడు స్మిత్​. కొత్త బాధ్యతలు చేపట్టిన సిల్వర్​వుడ్​కు అభినందనలు అని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ముంబయి కెప్టెన్ రోహిత్​ శర్మకు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.