ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్​ టెస్టులకు వికెట్​ కీపర్ ఎవరు?

author img

By

Published : Jul 13, 2021, 5:31 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో పంత్(Rishab Pant)​ విఫలమైన నేపథ్యంలో ఇంగ్లాండ్​తో జరగబోయే సిరీస్​లో అతడి​ స్థానంలో కేఎల్​ రాహుల్​ లేదా సాహాను(KL Rahul or Wriddhiman Saha) తీసుకోవాలని టీమ్​ఇండియా భావిస్తోందని తెలిసింది. ఒకవేళ పంత్​కు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటే తన స్థానంలో వీరిద్దరిలో తొలి ప్రాధాన్యత ఎవరికి ఇస్తుందో చూడాలి.

panth
పంత్​

ఇంగ్లాండ్​తో సిరీస్​కు ముందు జట్టులో మార్పులు చేయాలని టీమ్ఇండియా భావిస్తుంది! రిషభ్ పంత్​(Rishab Pant) స్థానంలో కేఎల్​ రాహుల్​ లేదా వృద్ధిమాన్​ సాహాను(KL Rahul or Wriddhiman Saha) తీసుకోవాలని అనుకుంటోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో పంత్​ అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో రాహుల్​ లేదా సాహాను తీసుకోనున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

తొలి ప్రాధాన్యం కేఎల్​ రాహుల్​?

కేఎల్​ రాహుల్​కు తొలి ప్రాధాన్యత దక్కకపోవచ్చు. ఎందుకంటే చివరిసారిగా అతడు 2019లో వెస్టిండీస్​పై ఆడాడు. ఆ సిరీస్​లో భారత్​ 2-0తేడాతో గెలిచినప్పటికీ రాహుల్​ ఆకట్టుకోలేకపోయాడు. ఒకవేళ అతడిని వికెట్​కీపర్​గా తీసుకుంటే ఓ ఆల్​రౌండర్​ను తీసేయాల్సి వస్తుంది. మరోవైపు గాయంతో గిల్​ సిరీస్​కు దూరమయ్యాడు. కాబ్టటి అతడి స్థానంలో ఓపెనర్​గానైనా వచ్చే అవకాశముంది.

సాహా సరైనోడా?

పంత్​లా దూకుడుగా ఆడకపోయినప్పటికీ వికెట్​కీపర్​గా మంచి ప్రదర్శన చేయగలడు! చివరిసారిగా 2020లో రెండు టెస్టులు ఆడాడు. ఇంగ్లాండ్​లో బంతి స్వింగ్​ అవ్వడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి సాహా తీసుకుంటే కలిసొచ్చే అవకాశం ఉంది. భారత జట్టు నలుగురు పేసర్లతో ఆడుతుంది. కనుక స్టంప్స్​ వెనుక ఉండే బాధ్యతను అతడికే అప్పగించడం టీమ్​కు అనుకూలం. పంత్​కు విశ్రాంతి ఇవ్వడం వల్ల తన ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి అతడికి అవకాశం దొరుకుతుంది.

పంత్​ గురించి కోహ్లీ

"పంత్​ సానుకూల, ఆశావాహ దృక్ఫథాన్ని కోల్పోవాలని మేం అనుకోవడం లేదు. దాని గురించి పెద్దగా చింతించడం లేదు. అవగాహన లోపం వల్ల ఇలా జరుగుతుందా అనే విషయాన్ని గుర్తించి, చక్కదిద్దుకునే బాధ్యత అతడిదే. అవకాశం వచ్చినప్పుడల్లా తనను తాను నిరూపించుకునే ఆటగాడిగా పంత్ ఎదుగుతున్నాడు. పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుంటాడు. ఒక్కోసారి ఫలితం సరిగా రాలేదంటే.. అందరూ అవగాహన లోపం అని అంటుంటారు. అయితే క్రీడల్లో ఇది సాధారణమే" అని ఇటీవల ఓ ఇంటర్వూలో పంత్​ గురించి కోహ్లీ(Kohli) ఇలా అన్నాడు.

ఇదీ చూడండి: 'పంత్​ కూడా సెహ్వాగ్​, గిల్​క్రిస్ట్ లాంటివాడే​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.